ఏపీ ప్రభత్వం సంచలన నిర్ణయం.. జీవో 117 రద్దు..! ఐదు రకాల స్కూళ్లు.. పాఠశాలల కొత్త వర్గీకరణ ఇలా..

Header Banner

ఏపీ ప్రభత్వం సంచలన నిర్ణయం.. జీవో 117 రద్దు..! ఐదు రకాల స్కూళ్లు.. పాఠశాలల కొత్త వర్గీకరణ ఇలా..

  Fri Jan 10, 2025 11:10        Politics

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ఐదు రకాల స్కూళ్లు ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా తొలుత గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేస్తారు. కొత్తగా తీసుకురానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం 4,731 పాఠశాలల నుంచి తొలగించి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3,4,5 తరగతులను తిరిగి వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి వాటిని ఉన్నతీకరించడం కానీ, ప్రాథమిక బడులుగా మార్చడం కానీ చేస్తారు. అలాగే, ఇంటర్మీడియెట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూలు ప్లస్ వ్యవస్థను కూడా తీసేసి, ఇంటర్‌ను ఇంటర్మీడియెట్ విద్యాశాఖకు అప్పగించనుంది. గతేడాది డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అలాగే, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది. 

ఐదు రకాల స్కూళ్లు ఇవే..
పూర్వ ప్రాథమిక విద్య 1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ) బోధించే అంగన్‌వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుస్తారు. 
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తోపాటు 1,2 తరగతులను కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1,2తోపాటు 1 నుంచి 5 తరగతులు ఉండేవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా వ్యవహరిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తోపాటు 1 నుంచి 5 తరగతులతో గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్‌కు ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తారు.
6
నుంచి 10 వరకు తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలు.

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting