అమెరికాలో ఊహించని అగ్ని ప్రమాదం! రూ.5 లక్షల కోట్లకుపైగా ఆస్తి నష్టం! ఈ మధ్య కాలంలో ఇదే...

Header Banner

అమెరికాలో ఊహించని అగ్ని ప్రమాదం! రూ.5 లక్షల కోట్లకుపైగా ఆస్తి నష్టం! ఈ మధ్య కాలంలో ఇదే...

  Fri Jan 10, 2025 13:42        U S A

అగ్రరాజ్యం అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు కనీవినీ ఎరుగని నష్టాన్ని మిగుల్చుతోంది. ఈ మంటల్లో చిక్కుకుని ఇప్పటి వరకూ దాదాపు పది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2 వేలు వరకు నిర్మాణాలు దెబ్బతినగా.. మరో 13,000 భవనాలకు ముప్పు పొంచి ఉంది. హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటలకు కాలిబూడిదవుతున్నాయి. దీంతో వారంతా తమ ప్రాణాలను కాపాడుకోడానికి కట్టుబట్టలతో ఇళ్లను వీడుతున్నారు.

 

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్‌ఫైర్‌ కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో సంపన్నుల నగరంగా పేరొందిన లాస్‌ ఏంజెలెస్ కాలి బూడిదైపోతోంది. ఈ ప్రాంతంలో హాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు బిలియనీర్లు నివసిస్తుంటారు. ఈ కార్చిచ్చులో ఖరీదైన ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు మంటల్లో బూడిదవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. మాలిబు ప్రాంతంలో హంటర్‌ బైడెన్‌కు అత్యంత విలాసవంతమైన మాన్షన్ ఉంది. ఈ కార్చిచ్చులో ఆ మాన్షన్‌తో పాటు ఖరీదైన కారు కూడా కాలిపోయింది. మాన్షన్‌ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

లాస్ పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. రెండ్రోజుల వ్యవధిలో వేల ఎకరాలు ఆహుతికాగా ప్రస్తుతం హాలీవుడ్‌ కొండలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఈ అగ్నికీలల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రికి సుమారు 2వేల ఇళ్లు దగ్ధమైనట్లు వెల్లడించారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కార్చిచ్చులో దగ్ధమైన నివాసాలు, కార్లు, ఖరీదైన వస్తువుల విలువ మొత్తం కలిపి 57 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 5లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉండే అవకాశాల వల్ల కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 

ఈ కార్చిచ్చులో అతిపెద్దదైన పాలిసాడ్స్‌ ఫైర్‌ కారణంగా 15,800 ఎకరాలు, ఈటన్‌ ఫైర్‌ వల్ల ఆల్టడేనా, పసాడెనా ప్రాంతాల్లోని 10 వేల ఎకరాలు, సన్‌సెట్‌ ఫైర్‌ 5 వేలకు పైగా ఎకరాలు, హురెస్ట్‌ ఫైర్‌ సైల్మర్‌లో 700 ఎకరాలు, లిడియా ఫైర్‌ 340 ఎకరాలను బుగ్గిపాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఉడ్లీ ఫైర్‌ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురాగా.... సన్‌సెట్‌ ఫైర్‌ ప్రస్తుతం హాలీవుడ్‌ కొండలను చుట్టుముట్టి వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్ల ద్వారా నీటిని చిమ్ముతున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ కార్చిచ్చులో స్టూడియో సిటీ, రన్‌యాన్‌ కెనాన్‌లో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. రియాల్టీ టీవీ స్టార్‌ పారిస్‌ హిల్టన్‌, నటులు యూజిన్‌ లెవీ, బిల్లి క్రిస్టల్‌, జాన్‌ గుడ్‌మన్‌ ఇళ్లు కూడా కాలిపోయాయి. స్టూడియో సిటీ పరిసరాల్లో చాలామంది సినీతారలు ఇళ్లను, భారీగా సంపదను కోల్పోయారు. 2005లో సంభవించిన కార్చిచ్చు తర్వాత ఇదే అతిపెద్దదని యూఎస్ అధికారులు వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants