ఆ విష‌యంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్ట‌ర్‌ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు!

Header Banner

ఆ విష‌యంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్ట‌ర్‌ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు!

  Wed Jan 15, 2025 17:22        Cinemas

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్'. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్ర‌స్తుతం థియేట‌ర్‌ల‌లో ర‌న్ అవుతుంది. అయితే, ఈ మూవీ ర‌న్‌టైంకి సంబంధించి ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇటీవ‌ల‌ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శంక‌ర్‌ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజ‌ర్ అవుట్‌పుట్ విష‌యంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా ర‌న్‌టైం విష‌యంలో. మొద‌ట‌గా నేను అనుకున్న దాని ప్ర‌కారం ఈ చిత్రం 5 గంట‌ల ర‌న్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుత‌మైన‌ సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నంద‌న్‌, అప్ప‌న్న పాత్రల్లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టించిన‌ ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!

 

గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..

 

వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

 

మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

 

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove