లోకల్ టీవీ ఛానెల్స్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా..! టాలీవుడ్ నిర్మాత తీవ్ర ఆగ్రహం!

Header Banner

లోకల్ టీవీ ఛానెల్స్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా..! టాలీవుడ్ నిర్మాత తీవ్ర ఆగ్రహం!

  Wed Jan 15, 2025 15:37        Cinemas

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజ్ సినిమాను పైరసీ భూతం వెంటాడుతోంది. ఇప్పటికే పలు పైరసీ సైట్లలో గేమ్ ఛేంజర్ హెచ్ డీ వెర్షన్ కనిపిస్తోంది. ఇటీవల ఓ బస్సులోని టీవీలోనూ ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. దీంతో చిత్రబృందం సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంత ఉరుగుతున్నా పైరసీ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒక లోకల్ ఛానెల్ లో గేమ్ ఛేంజర్ సినిమాను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పైరసీ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిది. దీనిపై ప్రముఖ నిర్మాత, బేబీ ఫేమ్ ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే టీవీలోని లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్ చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.



ఇంకా చదవండి18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!



ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు ఇది ఏమాత్రం సహించదగినది కాదు. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే గడచింది. అప్పుడే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు ఏళ్ల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్, శ్రమను తీవ్రంగా దెబ్బతీయడమే కాదు.. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తుకు ప్రమాదకరంగ కూడ మారుతాయి. పైరసీ విషయంపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పిలుపునిచ్చారు ఎస్కేఎన్. తన పోస్టుకు 'సేవ్ సినిమా' అని హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #globalstar #Ramcharan #movie #gamechanger #todaynews #flashnews #latestupdate