తిరుపతి లో తీవ్ర విషాదం! ఉదయం పెళ్లి, సాయంత్రం వధువు ఆత్మహత్య!

Header Banner

తిరుపతి లో తీవ్ర విషాదం! ఉదయం పెళ్లి, సాయంత్రం వధువు ఆత్మహత్య!

  Wed Jan 22, 2025 08:34        India

కాళ్ల పారాణి ఆరలేదు, పెళ్లి పీటలెక్కి గంటలైనా గడవ లేదు.. ఇంతలోనే ఆ కుటుంబాలను తీవ్ర విషాదం వెంటాడింది. ఉదయం పెళ్లి జరగ్గా.. సాయంత్రానికి వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడులో జరిగిన ఘటన విషాదాన్ని నింపింది. డిగ్రీ చదువుతున్న యువతికి మేనమామతో వివాహం నిశ్చయం కాగా.. సోమవారం ఉదయం పెళ్లి జరిగింది. ఆలయానికి వెళ్లొచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు. సాయంత్రానికి వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. 

 

ఉదయం వివాహం ఘనంగా జరిగింది.. అనంతరం కొత్త దంపతులు ఆలయానికి వెళ్లి వచ్చారు. సాయంత్రానికి వధువు ప్రాణాలు తీసుకుంది. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సత్యవేడు మండలం ఆంబాకంకు చెందిన ధనుంజయ, రది దంపతుల కుమార్తె ఆర్తి. ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఆర్తికి అదే గ్రామానికి చెందిన మేనమామ సూర్యతో ఊతుకోటలో సోమవారం వివాహాన్ని ఘనంగా జరిగింది. అనంతరం కొత్త దంపతుల్ని తీసుకుని తిరుత్తణి ఆలయానికి కుటుంబసభ్యులు వెళ్లారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మధ్యాహ్నం కొత్త జంట వరుడు సూర్య ఇంటికి రాగా.. తనకు అలసటగా ఉందని ఆర్తి నిద్ర పోయేందుకు బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అయితే సాయంత్రం అవుతున్నా ఆర్తి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.. ఆమెను పిలిచినా పలకలేదు. కుటుంబ సభ్యులు అనుమానంతో గతి తలుపులు పగులకొట్టి చూడగా ఆర్తి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే ఊతుకోటలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ అప్పటికే ఆర్తి చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.

 

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్తి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం వివాహం కాగా.. సాయంత్రానికి వధువు చనిపోవడంతో తీవ్ర విషాదం నింపింది. ఆర్తి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివాహం ఇష్టం లేక ప్రాణాలు తీసుకుందా.. ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #India #Tirupati #Bride #Suicide #Marriage #Wedding