గూగుల్ లేఆఫ్స్! మరో పది శాతం మంది ఉద్యోగులు ఇక ఇంటికే!

Header Banner

గూగుల్ లేఆఫ్స్! మరో పది శాతం మంది ఉద్యోగులు ఇక ఇంటికే!

  Sat Dec 21, 2024 11:00        Technology

గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ తాజాగా సంస్థలో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఇందులో మేనేజర్ స్థాయి పోస్టులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని గూగుల్ వర్గాల కథనం. ఇటీవల అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో ఉద్యోగుల ఉద్వాసన నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ధృవీకరించారు. ఓపెన్ఏఐ మాదిరిగా ఏఐ ఫోకస్డ్ సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని ఆపరేషన్స్ క్రమబద్ధీకరించేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల! ఇవాళా? రేపా? ఎల్లుండా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రెండేండ్లుగా విస్తృత ప్రాతిపదికన సంస్థ పునర్వ్యవస్థీకరణ వ్యూహంలో భాగంగా గూగుల్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నది. వ్యక్తిగత కంట్రిబ్యూటర్ రోల్స్ వంటి కొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తారని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. 2022 సెప్టెంబర్ నెలలో గూగుల్ 20 శాతం మరింత శక్తిమంతంగా మారాలని భావిస్తున్నట్లు అప్పట్లోనే సుందర్ పిచాయ్ చెప్పారు. తదనుగునంగా గతేడాది జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది. 2024లో 539 టెక్ కంపెనీలు 1,50,034 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్ డాట్ కామ్ తెలిపింది. గతేడాది 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

  

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకుఎంత అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Google #World #Technology