పదేళ్ల క్రితం 239 మందితో అదృశ్యమైన విమానం! ఇప్పుడు కనిపెడితే రూ. 595 కోట్లు!
Sun Dec 22, 2024 12:38 Malaysia2014 సంవత్సరంలో అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం MH370 గురించి అందిరికీ తెలిసిందే. అయితే ఈ విమానం జాడ గుర్తించేందుకు మళ్లీ మలేషియా చర్యలు చేపట్టింది. ఈ విమాన అన్వేషణను పునఃప్రారంభించేందుకు మలేషియా సర్కారు 70 మిలియన్ డాలర్ల (దాదాపు 595 కోట్ల రూపాయలు) ప్రతిపాదన పెట్టగా.. టెక్సాస్‌కు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 18 నెలలలోపు ఈ విమానం గుర్తించేందుకు ఆపరేషన్ చేపడతామని సదరు సంస్థ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2014 మార్చి 8వ తేదీన బోయింగ్ 777 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తుండగా అదృశ్యం అయింది. అయితే పదేళ్ల క్రితం 239 మందితో బయలుదేరిన MH370 విమానం ఏమైపోయిందనేది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని ఉపగ్రహ డేటా సూచించింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఆ విమాన శకలాలను గుర్తించేందుకు మలేషియా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా విజయవంతం కాలేదు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అదే ఏడాది తొలిసారిగా 200 మిలియన్ డాలర్లతో ఈ విమాన గుర్తింపు ప్రతిపాదనను తీసుకు వచ్చింది. మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల నేతృత్వంలో శోధన మొదలు అయింది. లక్షా 20 వేల చదరపు కిలీ మీటర్ల మేర వెతికారు. కానీ ఎలాంటి శకలాలు దొరకకపోవడంతో 2017 జనవరిలో దీన్ని ఆపేశారు. ఆ తర్వాత రెండోసారి 2018లో ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ.. లక్షా 12 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మూడు నెలల పాటు శోధనను నిర్వహించింది. కానీ శిథిలాలు గుర్తించలేకపోయింది. ఇక మూడోసారి చేసిన శోధనలో మాత్రం విమాన రెక్కల శకలాలు సహా 30కి పైగా శిథిలాలు ఆఫ్రికా తీరం మరియు హిందూ మహాసముద్ర దీవుల వెంబడి దొరికాయి.
దీన్ని ఆధారంగా చేసుకునే ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ తాజాగా మరోసారి మలేషియాతో ఒప్పందం చేసుకుంది. మొత్తం 70 మిలియన్ల డాలర్లకు ఈ ఒప్పందం కుదరగా.. 1500 చదరపు కిలోమీటర్ల మేర శోధన సాగిస్తామని చెబుతోంది. అయితే జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఈ శోధనను ప్రారంభించాలని ఓషియన్ ఇన్ఫినిటీ సంస్థ యోచిస్తోంది. ముఖ్యమైన, పెద్ద పెద్ద శిథిలాలు కనిపెడితే మాత్రమే మలేషియా సర్కారు ఈ డబ్బును చెల్లిస్తుంది. లేదంటే డబ్బు ఇవ్వదు. మరి నాలుగో సారి అయినా ఈ విమానానికి సంబంధించిన శిథిలాలు దొరుకుతాయో లేదో చూడాలి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..
రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
ఏపీలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!
మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!
ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Malaysia #Flight #Government #MalaysiaFlight
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.