తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి! ఏపీ, తెలంగాణ వాతావరణ అప్డేట్!
Thu Jan 16, 2025 22:34 Environmentఅరేబియా సముద్రంలో అల్పపీడనం తొలగిపోయింది. కానీ ద్రోణి తరహా వాతావరణం ఉంది. దాని వల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 18, 19 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి వాతావారణ హెచ్చరికా జారీ చెయ్యలేదు.
శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి. గాలి కదలిక ఎక్కువగా ఉంటుంది. ఎక్కడా వర్షం పడే అవకాశాలు లేవు. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుంది. గాలి వేగం చూస్తే.. బంగాళాఖాతంలో గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఇంకా చదవండి: అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉష్ణోగ్రత పగటివేళ తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంటే.. ఏపీలో 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్ ఉంటే, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
తేమ పగటివేళ తెలంగాణలో 50 శాతం ఉంటే, ఏపీలో 60 శాతం ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 94 శాతం ఉంటే.. ఏపీలో 95 శాతం ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో రాత్రివేళ మంచు ఎక్కువగా కురుస్తుంది. మొత్తంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా బాగుంటుంది. ఊళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చేవారికి జర్నీ ఆహ్లాదకరంగా ఉంటుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఫోన్ సర్వీస్‌కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! డేటా రక్షణపై కీలక సూచనలు!
ఎస్బీఐ కీలక ప్రకటన! లోన్లపై కొత్త వడ్డీ రేట్లు! ఇవాళ్టి నుంచే అమల్లోకి!
ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!
గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..
వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Environment #Winter #Temperature
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.