నవంబర్ 11న విస్తారా చివరి ఫ్లైట్! సెప్టెంబర్ 3 నుండి బుకింగ్ లు బంద్!

Header Banner

నవంబర్ 11న విస్తారా చివరి ఫ్లైట్! సెప్టెంబర్ 3 నుండి బుకింగ్ లు బంద్!

  Sat Aug 31, 2024 11:05        Travel

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం నుంచి సింగపూర్ ఎయిర్ లైన్స్ కు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో విలీనానికి ముందు నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడపనుంది. ఆ తేదీ తర్వాత విమాన కార్యకలాపాలు అన్ని కూడా ఎయిర్ ఇండియా పరిధిలోకి వెళ్లనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్ లు, ఇతర అన్ని సేవలు కూడా అందుబాటులో ఉండవు, వాటన్నింటిని ఎయిర్ ఇండియా యాజమాన్యం నిర్వహిస్తుంది. చివరి తేదీ లోపు మాత్రం విస్తారా తన సేవలను యథావిధిగా అందిస్తుంది.

 

ఇంకా చదవండిరూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఉద్యోగ బదిలీలకు మరో 15 రోజుల గడువు పొడిగింపు! శాఖలలో గందరగోళం, నిబంధనల రూపకల్పనలో సవాళ్లు!

 

ఎయిర్ ఇండియాలో-విస్తారా విలీనం 18 నెలలకు పైగా జరుగుతోంది. విస్తారా సంస్థ టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ మధ్య 51:49 జాయింట్ వెంచర్గా ఉంది. అయితే విస్తారాను విలీనం చేసుకోవాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ కొన్ని వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎఫీఐపై ప్రభుత్వ అనుమతిని కోరగా, తాజాగా దానికి ఆమోదం లభించడంతో సింగపూర్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియాలో కొన్ని వాటాలు కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. దాదాపు ఈ పెట్టుబడి విలువ $276 మిలియన్ల వరకు అని అంచనా. ఈ డీల్ తరువాత ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ 25.1 శాతం వాటా ఉంటుంది. ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనాన్ని ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని సింగపూర్ ఎయిర్ లైన్స్ భావిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందాఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకిఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనాఅన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #India #VistaraAirlines #IndependenceDay