సంక్రాంతి ట్రాఫిక్‌తో విసిగిపోయారా? ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేసే నూతన మార్గాలు..!

Header Banner

సంక్రాంతి ట్రాఫిక్‌తో విసిగిపోయారా? ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేసే నూతన మార్గాలు..!

  Sat Jan 11, 2025 12:48        Travel

విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వెళ్లే ప్రయాణికులంతా ఎక్కువగా ప్రిపే ర్చసే రూట్ హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే. మ్యాగ్జిమమ్ అందరూ ఈ రూట్లోనే వెళ్తారు. సాధారణ రోజుల్లో అయితే ఓకే. మరి, హాలీడేస్, పండగ రోజుల్లో అయితే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయ్. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరతాయ్. వాహనం కదలాలంటే.. ఒక్కోసారి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. నగర శివార్లలోని దిల్సుఖ్నగర్ నుంచి చౌటుప్పల్ వెళ్లాలన్నా కనీసం మూడు నాలుగు గంటలు టైమ్ పడుతుంటుంది. అంటే, గంటలో వెళ్లాల్సిన దూరానికి నాలుగు గంటలు పట్టడం ఖాయం. ఇక, పంతంగి టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి అయితే మరీదారుణంగా ఉంటుంది. ఇక్కడ బంపర్ టు బంపర్ వెళ్తుంటాయ్ వాహనాలు. మరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా?. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ఒక్కటే మార్గమా? పోలీసులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి...

సంక్రాంతి ప్రయాణికులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడితే ప్రయాణం సాఫీగా సాగుతుంది అంటున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వైపు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటున్నారు. ట్రాఫిక్ జామ్స్ ను తప్పించుకోవాలంటే ఈ రూట్ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. గుంటూరు, నెల్లూరు వెళ్లేవారికి.. నాగార్జునసాగర్ మీదుగా ప్రత్యామ్నాయ రూట్ ఉందంటున్నారు. విజయవాడ, ఖమ్మం వెళ్లేవారికి.. భువనగిరి, రామన్నపేట మీదుగా మార్గం ఉందని గుర్తు చేస్తున్నారు.


ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..


రూట్ 1
హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నారు పోలీసులు. సాధారణంగా వీళ్లంతా హైదరాబాద్-విజయవాడ రూట్లో నార్కెట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై వెళ్తుంటారు. దాంతో, వీళ్లంతా హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చౌటుప్పల్, పంతంగి దగ్గర చిక్కుకుపోవడం ఖాయం. అయితే, వీళ్లందరికీ ప్రత్యామ్నాయ మార్గం ఉంది. కొంత దూరం పెరిగినా.. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేను ఎంచుకుంటే ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్నారు పోలీసులు. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లాలంటే.. ఓఆర్ఆర్ నుంచి బొంగులూరు గేట్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి నేరుగా నాగార్జునసాగర్ హైవేపైకి వెళ్లిపోవచ్చు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


రూట్ 2
అలాగే.. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు పోలీసులు. భువనగిరి, రామన్నపేట, చిట్యాల మీదుగా నార్కట్పల్లి చేరుకుంటే వీళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే.!. ఎందుకంటే, నార్కట్పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వెళ్తుంటాయ్. అలాగే, కొర్లపహాడ్ టోల్దేట్ దాటిన తర్వాత మరికొన్ని వాహనాలు ఖమ్మం వైపు వెళ్తుంటాయ్. మిగతా వాహనాలు మాత్రమే విజయవాడ వైపు వెళ్తాయి. అంటే, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు.. భువనగిరి, రామన్నపేట, చిట్యాల మీదుగా నార్కట్పల్లి చేరుకుంటే ట్రాఫిక్ తిప్పల్ని తప్పించుకోవచ్చు. - హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు.. ఓఆర్ఆర్ పైనుంచి ఘట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి వెళ్లాలి. అలాగే, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా భువనగిరి వెళ్లొచ్చు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదుఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #traffic #newroots #holidays #todaynews #flashnews #latestupdate