భారత్ నుండి ట్రైన్ లో విదేశాలకు వెళ్ళవచ్చు! ఈ 7 రైల్వే స్టేషన్ల ద్వారా!

Header Banner

భారత్ నుండి ట్రైన్ లో విదేశాలకు వెళ్ళవచ్చు! ఈ 7 రైల్వే స్టేషన్ల ద్వారా!

  Tue Jan 14, 2025 11:45        Travel

భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉంది. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం రైల్వే సేవలను విస్తరిస్తోంది. కొత్త టెక్నాలజీతో అడ్వాన్స్‌డ్ ట్రైన్స్ లాంచ్ చేయడంతో పాటు ఫ్యూచర్‌లో బుల్లెట్ ట్రైన్‌ను కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది.

 

ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో పెద్ద రైల్వే నెట్‌వర్క్ మనది. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఇండియన్ రైల్వేస్, విదేశాలకు వెళ్లేందుకు కూడా కొన్ని సర్వీసులు నడుపుతోంది. దేశంలోని ఏడు రైల్వే స్టేషన్ల నుంచి ట్రైన్‌లోనే విదేశాలకు ప్రయాణించవచ్చు. ఆ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.

 

బీహార్‌లోని మధుబని జిల్లాలో ఉన్న జయనగర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లోనే నేపాల్ వెళ్లవచ్చు. ఈ స్టేషన్ ఇండియా నుంచి నేపాల్ వెళ్లే వారికి గేట్‌వేగా పని చేస్తోంది. ఇక్కడి నుంచి జర్నీ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

 

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉన్న సింగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బంగ్లాదేశ్‌కు కనెక్టివిటీ ఉంది. ఈ స్టేషన్ రెండు దేశాల వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తద్వారా ఈ రైల్వే స్టేషన్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలకు బాటలు వేస్తోంది.

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది నేపాల్ బోర్డర్‌కు దగ్గర్లో ఉంది. ఆ దేశానికి వెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ అందిస్తోన్న ట్రైన్ సర్వీసెస్ ఇక్కడి నుంచి రన్ అవుతాయి. ఈ రైల్వే స్టేషన్ బీహార్‌లోని జోగ్బానిలో ఉంది. ఇక్కడి నుంచి కాలినడకన కూడా నేపాల్ చేరుకోవచ్చు. అయితే రైలు మార్గంలో ప్రయాణం మరింత సురక్షితం, సులభమైన మార్గం.

 

పంజాబ్‌లో ఉన్న అట్టారి రైల్వే స్టేషన్, ఇండియాలోని పాపులర్ రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఇక్కడి నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌, పాకిస్తాన్‌కు బయలుదేరుతుంది. ఇది రెండు దేశాల మధ్య ప్రయాణానికి అందుబాటులో ఉన్న ట్రైన్. అయితే జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, 2019 నుంచి ఈ ట్రైన్ సర్వీస్‌ను ఆపేశారు.

 

హల్దీబారి రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు రైలులో వెళ్లవచ్చు. హల్దీబారి స్టేషన్ నుంచి బంగ్లాకు ప్రయాణం అతి తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది.

 

బంగ్లాదేశ్ వెళ్లడానికి మరో మార్గం, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉన్న పెట్రాపోల్ రైల్వే స్టేషన్. రెండు దేశాల పౌరులు పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి సరిహద్దులు దాటుతున్నారు. ట్రైన్ సర్వీస్‌లు ఎక్కువగా ఉంటడం ఇక్కడి మరో ప్రత్యేకత. 

 

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలో ఉన్న రాధికాపూర్ రైల్వే స్టేషన్.. ఇండియా, బంగ్లాదేశ్ కనెక్టివిటీ సెంటర్‌గా ఉంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ట్రేడ్‌ ఇక్కడి నుంచి బాగా జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి కామన్ ప్యాసింజర్లు కూడా రైలులో బంగ్లాదేశ్‌కు చేరుకోవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama