ప్రెగ్నెన్సీలో తినే కొన్ని ఫుడ్స్‌తో తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యే! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

Header Banner

ప్రెగ్నెన్సీలో తినే కొన్ని ఫుడ్స్‌తో తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యే! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

  Sat Jan 25, 2025 08:13        Life Style

ప్రతి విషయం గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నట్లుగానే ప్రెగ్నెన్సీ చూట్టూ కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో చాలా మంది నిజాలు తెలుసుకోవడం కంటే ఎవరేం చెప్పినా వాటినే ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీ, పోషకాహారం గురించి గర్భిణీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా, హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మరికొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మారుతున్న కాలంలో ప్రెగ్నెన్సీలో తీసుకునే ఫుడ్స్ వాస్తవాలు తెలుసుకోవాలి. అదే విధంగా, సరైన ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే తల్లులతో పాటు పుట్టే పిల్లలకి కూడా ఎలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అవేంటో తెలుసుకోండి.

 

పాలు, పాలపదార్థాలు మంచివే. అయితే, అన్‌పాశ్చూరైజ్డ్ డెయిరీ ప్రొడక్ట్స్ అయినా పచ్చిపాలు, పెరుగు, సాఫ్ట్ చీజ్ వంటివి తీసుకోవద్దు. ఇందులో హానికరమైన బ్యాక్టీరియా లిస్టీరియా వంటివి ఉంటాయి. వీటి కారణంగా ఆరోగ్య సమస్యలు రావడం, అబార్షన్ అవ్వడం జరుగుతుంది. పుట్టబోయే పిల్లలకి కూడా ఈ పాలు మంచివి కాదు. కాబట్టి, వీటిని తీసుకోపోవడమే మంచిది.

 

ఇంకా చదవండిగుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

నిపుణుల ప్రకారం, చేపలు ఆరోగ్యకరమే. అయితే, షార్క్స్, స్వార్డ్ ఫిష్, కింగ్ మాకెరల్, టైల్ఫిష్ వంటి చేపల్లో మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వీటిని తింటే తల్లులు, పుట్టే పిల్లలకి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి, సీ ఫుడ్ తీసుకునేటప్పుడు సరైనవి తీసుకోవాలి. తక్కువ మెర్కూరీ ఉండే సాల్మన్, ష్రింప్, ట్రౌట్ వంటి చేపలు తినాలి. పచ్చి కూరగాయలు, సరిగా ఉడకని ఫుడ్స్ అసలే తినొద్దు. ముఖ్యంగా ఉడకని మాంసం, స్ప్రౌట్స్ తినొద్దు. కారణం ఇందులో పారాసిటిక్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా సాల్మోనెల్లా, ఈ కొలి, టాక్సోప్లాస్మా, లీస్టీరియా వంటివి ఉంటాయి. ఇవి తల్లీ, పుట్టే బిడ్డకి ప్రమాదకరం. దీని వల్ల మిస్ క్యారేజ్ అవ్వడం, త్వరగా పిల్లలు పుట్టడం, ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, సరైన ఫుడ్ష్ తీసుకోవాలి.

 

కెఫైన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటి వాటిని కూడా ఎక్కువగా తీసుకోవద్దు. దీని వల్ల కూడా ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉంది. కాబట్టి, ఈ డ్రింక్స్‌ని అవాయిడ్ చేయండి, సాలిడ్ ఫ్యాట్స్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వంటివి జంక్ ఫుడ్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో గుండె సమస్యలు, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మెటబాలిక్ రేట్ కూడా తగ్గుతుంది. ఒబేసిటి దూరమవుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితేదావోస్ లో చంద్రబాబు!

 

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!

 

ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనాఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!

  

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!

 

ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LifeStyle #Women #Pregnancy #Gestation #Foods #Diet