రాత్రి పూట ఈ ఆహారాల‌ను తినండి! వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది!

Header Banner

రాత్రి పూట ఈ ఆహారాల‌ను తినండి! వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది!

  Thu Jan 30, 2025 08:00        Health

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కోవ‌డంతోపాటు ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం, మెడిసిన్ల‌ను వాడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌డం లేదు. దీంతో రాత్రి పూట ఆల‌స్యంగా నిద్ర‌పోతున్నారు. ఉద‌యం కూడా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం తీసుకున్న‌ట్ల‌యితే దాంతో మైండ్ రిలాక్స్ అవ‌డ‌మే కాకుండా ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటార‌ని, నిద్ర కూడా చ‌క్క‌గా ప‌డుతుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. నిద్ర బాగా ప‌ట్టాలంటే అందుకు ట్యాబ్లెట్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు, మ‌ద్యం సేవించాల్సిన అవ‌స‌రం అస‌లే లేదు. ప‌లు ఆహారాల‌ను రోజూ రాత్రి పూట తీసుకుంటే చాల‌ని అంటున్నారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

కివి పండ్లు..
రోజూ రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం కివి పండ్ల‌ను తింటే మైండ్ రిలాక్స్ అవుతుంది. గాఢ నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు. కివి పండును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెరొటోనిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది హ్యాపీ హార్మోన్‌. క‌నుక మ‌న మూడ్ మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర గాఢంగా వ‌చ్చేస్తుంది. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం రాత్రి పూట భోజ‌నం చేసిన త‌రువాత కివిని నాలుగు వారాల పాటు తిన్న పేషెంట్ల‌లో నిద్ర బాగా ప‌ట్టింద‌ట‌. కివి పండ్ల‌ను తిన‌ని వారిలో నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌లేద‌ట‌. అలాగే కివి పండ్ల‌ను తిన్న‌వారు రాత్రి పూట నిద్ర లేచే సంఖ్య కూడా త‌గ్గింద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కివి పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిద్ర బాగా వ‌చ్చేలా చేస్తాయ‌ని అంటున్నారు. క‌నుక రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం ఒక కివి పండును తింటుంటే గాఢ నిద్ర‌లోకి జారుకోవ‌చ్చు.

 

ఇంకా చదవండి: కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత! 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గుమ్మ‌డికాయ విత్త‌నాలు..
గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటున్నా కూడా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ విత్త‌నాల‌ను తింటే శ‌రీరంలో మెగ్నిషియం శాతం పెరుగుతుంది. ఇది నిద్ర‌ను ప్రోత్స‌హిస్తుంది. దీంతో ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌డుతుంది. గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి మెగ్నిషియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది గాబా అనే ఒక న్యూరో ట్రాన్స్‌మిట‌ర్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీంతో నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌శాంతంగా మారుతుంది. దీని వ‌ల్ల నిద్ర వ‌స్తుంది. ప‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు. క‌నుక రోజూ రాత్రి గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే మంచిది. ఉద‌యం వీటిని నాన‌బెట్టి అదే రోజు రాత్రి వీటిని తింటే మేలు జ‌రుగుతుంది.

 

పెరుగు, బాదంప‌ప్పు..
ఇక రాత్రి పూట భోజ‌నంలో భాగంగా పెరుగును తీసుకోవాలి. కొంద‌రు రాత్రి పూట పెరుగును తిన‌రు. కానీ పెరుగును తింటే చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. పెరుగులో గాబా అనే అమైనో యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్య‌త‌ను పెంచుతుంది. ప‌డుకున్న వెంట‌నే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శాంతంగా మారుస్తుంది. దీంతో నిద్ర గాఢంగా వ‌స్తుంది. కాబ‌ట్టి రాత్రి పూట పెరుగును తినాల‌ని సూచిస్తున్నారు. దీంతోపాటు బాదంప‌ప్పు వంటి న‌ట్స్‌ను కూడా రాత్రి పూట తిన‌వ‌చ్చ‌ని, వీటితో మెగ్నిషియం స‌మృద్ధిగా ల‌భిస్తుందని, ఇది నిద్ర‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని సైంటిస్టులు అంటున్నారు. క‌నుక నిద్ర త‌క్కువ‌వుతుంద‌ని భావించే వారు ఈ ఆహారాల‌ను తింటే మేలు జ‌రుగుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Health #Sleep #Diseases #Diabetes #SleepCycle #HumanBody #Humans #Organisms