అమెరికాలో కేసు ఎఫెక్ట్... అదానీని అరెస్ట్ చేయాలి -రాహుల్ గాంధీ! అదానీ గ్రూప్ స్పందన ఇదే!

Header Banner

అమెరికాలో కేసు ఎఫెక్ట్... అదానీని అరెస్ట్ చేయాలి -రాహుల్ గాంధీ! అదానీ గ్రూప్ స్పందన ఇదే!

  Thu Nov 21, 2024 15:14        U S A

అమెరికాలో లంచం ఆరోపణల కేసుపై అదానీ గ్రూప్ ప్రకటన చేసింది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలు నిరాధారమని, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే... నిరూపితమయ్యే వరకు దోషులు కాదని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకటనలోనే ఉంది అని. పూర్తి పారదర్శకతతో నియంత్రణ సంస్థల నిబంధనలను పాటిస్తున్నాం. చట్టాలను గౌరవిస్తూ.. చట్ట ప్రకారమే నడుచుకుంటామని భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులకు చెప్పాం అని అదానీ గ్రూప్ ఆ ప్రకటనలో పేర్కొంది. 

 

ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలతో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... అదానీ అమెరికా, భారత్ చట్టాలను ఉల్లంఘించినట్లుగా తేలిపోయిందన్నారు. మోదీ-అదానీ బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమని వ్యాఖ్యానించారు. 

 

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అమెరికాలో కేసు నేపథ్యంలో తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అదానీ తన అవినీతి ద్వారా దేశాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆయనను కాపాడుతున్న సెబి చీఫ్ మాధభి పురి బచ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినా అదానీ అరెస్ట్ కాడని కచ్చితంగా చెప్పగలనని... ఎందుకంటే ఆయనను మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. 

 

కాగా, భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురు కలిసి అధికారులకు లంచం ఆఫర్ చేసినట్లుగా అమెరికాలో కేసు నమోదైంది. రూ.2,000 కోట్లకు పైగా లంచం ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. అలాగే, బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants Andhra