అమెరికా కలలు కంటున్న భారతీయులకు షాక్! H-1B రిజిస్ట్రేషన్స్‌లో 38 శాతం మేర తగ్గుదల!
Wed Jan 29, 2025 19:01 U S Aఅమెరికా ప్రభుత్వం ఇటీవల హెచ్-1బీ వీసా వ్యవస్థలో తెచ్చిన మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. వీసా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు తెచ్చిన ఈ మార్పుల కారణంగా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మారు 38 శాతం మేర తగ్గినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Drop in H-1b Visa Registrations). మునుపటి నిబంధనల ప్రకారం, ఒక్కో లబ్దిదారుడి కోసం పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇది లబ్ధిదారులకు వీసా వచ్చే అవకాశాలు గణనీయంగా పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలక మార్పు చేసింది. ఒక లబ్దిదారుడిపై ఒకే రిజిస్ట్రేషన్‌ను అనుమతిస్తామని పేర్కొంది. సదరు అభ్యర్థికి ఎన్ని సంస్థల మద్దతున్నా దరఖాస్తు మాత్రం ఒకటే ఉంటుందని స్పష్టం చేసింది. వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు, అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు ఈ మార్పు తెచ్చినట్టు వెల్లడించింది.
ఇంకా చదవండి: ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరత్వ, వలసల శాఖ వద్ద 479,953 రిజిస్ట్రేషన్లు అందాయి. అంతకుమునుపు నమోదైన 758,994 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఈసారి వీటి సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇక ఈసారి వచ్చిన వాటిల్లో 470,342 రిజిస్ట్రేషన్లు పరిశీలనకు అర్హమైనవిగా తేలింది. గతంలో ఒక్కో లబ్దిదారుడి సగటు రిజిస్ట్రేషన్లు 1.70 కాగా, ప్రస్తుతం ఇది 1.06కి పడిపోయింది. అమెరికా కలలు కంటున్న భారతీయులకు హెచ్-1బీ వీసా ప్రధాన మార్గంగా మారిన విషయం తెలిసిందే. 2023లో 386,000 వీసాలు జారీ కాగా వీటిల్లో ఏకంగా 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. తొలుత మూడేళ్ల కాలపరిమితిపై జారీ చేసే ఈ వీసా ఆ తరువాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. 10 డాలర్లు చెల్లించి కంపెనీలు లబ్దిదారుడి పేరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత దశల్లో కూడా లబ్ధిదారులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ల పరిశీలన కోసం కాన్సులార్ అపాయింట్ల కోసం పోటీ అధికంగా ఉంటోంది. ఇక డ్రాప్ బాక్స్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను చెన్నై కార్యాలయమే పరిశీలిస్తున్నప్పటికీ అన్ని వీసా కేంద్రాల్లో వీటిని దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదెలా ఉంటే తాజా మార్పుల దీర్ఘకాలిక ప్రభావం భారతీయులపై ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #H1BVisa #India #Students #USANews #Government #Update #H1B
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.