దుబాయ్ లో దొరికే స్పెషల్ టీ! ఖరీదు జస్ట్ రూ.1.14 లక్షలే! మీరు కూడా ట్రై చేస్తారా?

Header Banner

దుబాయ్ లో దొరికే స్పెషల్ టీ! ఖరీదు జస్ట్ రూ.1.14 లక్షలే! మీరు కూడా ట్రై చేస్తారా?

  Sun Dec 15, 2024 13:55        U A E

కప్పు టీ ఖరీదు మహా అంటే పదిహేను రూపాయలు.. అదే కాస్త ఖరీదైన రెస్టారెంట్ లో వందో రెండొందలో ఉంటుంది. స్టార్ హోటళ్లలో వేలల్లో ఉంటుందేమో కానీ దుబాయ్ లో మాత్రం కప్పు టీ రూ.1.14 లక్షలు.. అవును అక్షరాలా లక్షా పద్నాలుగు వేల రూపాయలు మాత్రమేనట. ఇంత ఖరీదా.. టీని బంగారంతో తయారుచేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా..? నిజమే బంగారంతోనే తయారుచేస్తున్నారు. స్వచ్ఛమైన వెండితో తయారుచేసిన కప్పులో బంగారు పూత (24 క్యారట్ బంగారంతో) తో ఈ టీని స్పెషల్ గా సర్వ్ చేస్తారు. ఒక్కో సిప్ లో వేడివేడి చాయ్ తో పాటు బంగారాన్ని తాగేయొచ్చు. 

 

ఇంకా చదవండివైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

టీ తాగాక కప్పును అక్కడే వదిలేయకుండా ఎంచక్కా ఇంటికి తెచ్చేసుకోవచ్చు. దుబాయ్ లోని బోహో కేఫ్ ఈ గోల్డ్ కడక్ చాయ్ ని సర్వ్ చేస్తోంది. భారత సంతతికి చెందిన సుచేత శర్మ ఈ కేఫ్ ను నడిపిస్తున్నాడు. తమ కస్టమర్ల కోసం, వారి హోదాకు తగ్గట్లుగా స్పెషల్ గా ఈ టీని సర్వ్ చేస్తున్నామని సుచేత చెప్పారు. ఈ టీ తో పాటు గోల్డ్ సావనీర్ కాఫీ (రూ.1.09 లక్షలు) కూడా తమ కేఫ్ లో అందుబాటులో ఉందని వివరించారు. కాగా, బోహో కేఫ్ లో సర్వ్ చేసే ఈ స్పెషల్ టీని ఓ ఫుడ్ వ్లాగర్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates