సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట! స్కిల్ కేసులో వారి జోక్యం అనవసరం!

Header Banner

సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట! స్కిల్ కేసులో వారి జోక్యం అనవసరం!

  Wed Jan 15, 2025 14:29        Others

సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గా కోర్టుకు వెల్లడించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది.



ఇంకా చదవండి18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!



2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు.. మీకేం సంబంధం.. పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి..? అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ ను డిస్మిస్ చేసింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #supremecourt #skillcase #petetion #chargesheet #todaynews #flashnews #latestupdate