చాగంటిపై అసత్య ప్రచారం చేసినవారిపై తితిదే ఫిర్యాదు..! బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం!

Header Banner

చాగంటిపై అసత్య ప్రచారం చేసినవారిపై తితిదే ఫిర్యాదు..! బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం!

  Wed Jan 29, 2025 16:56        Others

ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు (Chaganti Koteswara Rao) అవమానం జరిగిందంటూ అసత్య ప్రచారం చేసిన సోషల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులపై పోలీసులకు తితిదే ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తిరుపతి యూనివర్సిటీ పోలీసు స్టేషన్తో పాటు దిల్లీ, విజయవాడ పీఐబీలో ఫిర్యాదు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విషప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలంటూ యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్కు కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తితిదే (TTD) తెలిపిన వివరాల ప్రకారం.. చాగంటి కోటేశ్వరరావు జనవరి 14న తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు 16వ తేదీ సాయంత్రం మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ 20, 2024న తితిదే అనుమతి ఇచ్చింది. ఆయనకు ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల! 


దీనిలో భాగంగా రాంబగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ తితిదే చేసిన ప్రత్యేక ఏర్పాట్లను చాగంటి సున్నితంగా తిరస్కరించారు. సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు జనవరి 8న తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని తితిదే (Tirumala) ఉన్నతాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించారు. మరోసారి ఆయన అనుమతితో వేరే తేదీల్లో ప్రవచనాల కార్యక్రమం నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


వాస్తవం ఇలా ఉండగా.. బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని సోషల్ మీడియా ఛానళ్లలో అసత్యాలను ప్రచారం చేశారు. చివరి నిమిషంలో పరిపాలనా కారణాల వల్ల చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని తితిదే రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, తితిదేను పలుచన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను పదేపదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తితిదే ఫిర్యాదులో కోరింది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

 

తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!

 

డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!

 

దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..

 

షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టునంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

 

శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

 

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #chaganti #fakenews #falsestatement #todaynews #flashnews #latestupdate