వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?
Wed Jul 31, 2024 08:28 Politicsచంద్రబాబు గెలిచిన తరువాత, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ పై ఢిల్లీ వెళ్లి మరీ పోరాడారు.. మొన్న కేంద్రం బడ్జెట్ లో కూడా పెట్టింది. అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?
వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గేం చేంజర్.. పోలవరం, అమరావతి తరువాత, చంద్రబాబు గారు కేంద్రం దగ్గర పెట్టిన మరో ముఖ్యమైన ప్రపోజల్ ఇది. మొన్న బడ్జెట్ లో దీని పై కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇది విభజన చట్టం ప్రకారం, చట్ట ప్రకారం మనకు వచ్చిన ప్రాజెక్ట్. విభజన చట్టంలోని సెక్షన్ 93లో పొందుపరిచారు. దాని ప్రకారం 2014 జూన్ 2 నుంచి ఆరు నెలల్లోపు దీనిపైన అధ్యయనం చేయించి, దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్ తరహాలోనే నిర్దిష్ట కాలపరిమితిలోగా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి అని ఉన్నా, 10 ఏళ్ళు అయినా ఆతీ గతి లేదు.
అసలు ఏంటీ ప్రాజెక్ట్?
మన దేశంలో మొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్ ఇది. మొత్తం నాలుగు ఆర్థిక కేంద్రాలు, తొమ్మిది పారిశ్రామిక సముదాయాలు ఉంటాయి. విశాఖపట్నం (6,931 ఎకరాలు), మచిలీపట్నం (12,145 ఎకరాలు), శ్రీకాళహస్తి-ఏర్పేడు (26,425 ఎకరాలు), దొనకొండ (17,117 ఎకరాలు) నోడ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నాడు ప్రతిపాదించింది. సుమారు 800 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. ఈ కారిడార్ పూర్తయితే, ఒక కోటి ఇరవై లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అందుకే చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కోసం అంతలా వెంటబడుతుంది.
ఇంకా చదవండి: ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ఛాన్స్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇందులో ఏమి చేస్తారు..
ఇండస్ట్రీలు పెట్టటానికి మౌలికరంగ వసతుల అభివృద్ధి చేస్తారు. రహదారులు, తాగునీటి పైప్ లైనులు, డ్రెయిన్లు, పవర్ సబ్ స్టేషన్లు ఇలా.. ప్రస్తుత జాతీయ రహదార్లకు అనుసంధాన రహదార్లు, రైల్వేలైన నిర్మాణం చేస్తారు. ఓడరేవులకు.. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తారు. విదేశాలకు సరుకును ఉత్పత్తి చేసేలా మౌలిక సదుపాయాల కల్పన ఉంటుంది. దీని నిర్మాణంతో తూర్పతీర పారిశ్రామిక రూపురేఖలు వూరిపోతాయి.
మౌళిక వసతలు వచ్చాక ఏమి అవుతుంది?
వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ మౌళిక వసతులు నిర్మాణంతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం అందుబాటులోకి వస్తుంది. సమర్థవంతమైన రవాణా, నీరు, విద్యుత సరఫరా, నిపుణులైన పనివాళ్లు, పారిశ్రామిక అనుకూల విధానాలు, అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థల ఏర్పాటుతో, పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయి. ఈ కారిడార్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్నుంచి రాయితీలందుతాయి. అలాగే ఈ కారిడార్కు జాతీయ రహదార్లు, రైల్వే ప్రధాన లైన్లతో అనుసంధానముంటుంది. తీరం వెంబడి కొన్ని మధ్యతరహా పోర్టుల నిర్మాణానికి అవకాశాలొస్తాయి. దేశంలోని ఇతర కారిడార్లతో పోలిస్తే విమానాశ్రయాలు, రేవులు, జాతీయ రహదార్లు, ప్రధాన రైలు మార్గాలకు అత్యంత దగ్గరలో ఉన్న కారిడార్ ఇదొక్కటే.
అలాగే ఈ కారిడార్ వెంబడన్నప్రాంతాల్లో ఎప్పడూ ఎలాంటి కార్మిక అశాంతి లేదు. రాజకీయ సుస్థిరత ఉంది. సైకో గాడు ఎంత చించుకున్నా, ఇక్కడ ఏమి చేయలేడు.
ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు తూర్పు దేశాలు, ఈస్ట్ కోస్ట్ కంటే, వెస్ట్ కోస్ట్ ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. మన తూర్పు తీరం దాటుకుని, పశ్చిమ తీరానికి వెళ్తున్నారు. ఒకరకంగా ఇన్నాళ్ళు ఈస్ట్ కోస్ట్ డెవలప్ చేయకపోవటం వెనుక, కుట్ర కూడా ఉంది..అది వేరే విషయం..
షార్ట్ గా చెప్పాలి అంటే, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తే ప్రయోజనాలివి...
* జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుంది
* తయారీ రంగ సామర్థ్యం భారీగా పెరుగుతుంది
* 1.10 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
* ఆ ప్రాంతం మొత్తం, మౌళిక సదుపాయాలు టాప్ క్లాస్ లో ఉంటాయి
పదేళ్ళ నుంచి విశాఖపట్నం -చెన్నై పారిశ్రామిక కారిడార్ లో ఏమి జరిగింది?
ఇప్పుడు కేంద్రం బడ్జెట్ లో పెట్టిందని, కేంద్రాన్ని ప్రసంసిస్తున్నాం కానీ, ఇప్పటి వరకు ఇది లేట్ అవటానికి కారణం కేంద్ర ప్రభుత్వం, గత 5 ఏళ్ళు పట్టించుకోని జగన్ రెడ్డి.
చంద్రబాబు ఉండగా, 2014-19 మధ్య ఇందులో కొంత కదలిక వచ్చింది . ఈ కారిడార్ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4,170 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. ఏడీబీ ఇస్తున్న రుణం కేంద్రమే తరువాత చెల్లిస్తుంది. రాష్ట్రానికి సంబంధం ఉండదు. మరో రూ.1,419 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తారు. అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం రూ.535 కోట్లను భూ సేకరణ, ఇతర అవసరాలకు చెల్లింపులు జరిపింది. కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది. 2018 తరువాత చంద్రబాబు మోడీతో విబేధించటంతో, ప్రాజెక్టుపై కొర్రీల మీద కొర్రీలను వేస్తూ కేంద్రం కాలయాపన చేసింది. తొలిదశలో భాగంగా పారిశ్రామిక, పట్టణ మౌలిక వసతులు, రోడ్లు, పవర్ ప్రాజెక్టులు తదితర 11 ప్రాజెక్టులు చేపట్టాలనేది ప్రతిపాదన. వీటిల్లో ఒక్కదానికే టెండర్లు ఖరారయ్యాయి. మిగతావన్నీ బిడ్డింగ్ దశలోనే నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ ఇలా ఉండగానే, జగన్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. తన కేసులు తప్ప, ఈ ప్రాజెక్ట్ గురించి ఏ నాడు పట్టించుకుంది లేదు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ వచ్చాడు. రావటంతోనే, మొదటి ఢిల్లీ పర్యటనలో, అమరావతి, పోలవరం తరువాత వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ పైనే ఫోకస్ పెట్టి, కేంద్ర బడ్జెట్ లో పెట్టించి స్పష్టమైన హామీ తీసుకున్నారు. వచ్చే రెండేళ్ళలో ఈజీగా మొదటి దశ పూర్తి చేసేయొచ్చు.
ఇంకా చదవండి: వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!
నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
గోదావరిలో యువకుడి గల్లంతు.. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం! వరద ఉధృతి తగ్గేంత వరకు!
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi ##PVR #btechravi #NaraChandrababuNaidu #NarendraModi #NaraLokesh #PawanKalyan #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.