ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

Header Banner

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

  Wed Jul 31, 2024 14:12        Politics

ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దీంతో ఆగస్టు 6న నోటిఫికేషన్ రానుండగా, ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఈ బై ఎలక్షన్ పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో మూడు జిల్లాల్లో (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కోడ్ ముగిసేంత వరకూ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఉండవని అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉండవని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 
మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!

 

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

 

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేతదానికి కారణం అదేనా!

 

 నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలుదరఖాస్తు చివరి తేదీ ఇదే!

 

గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు! కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP #JSP