శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

Header Banner

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

  Tue Aug 13, 2024 16:49        Politics

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా మరో హామీని అమలు చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. తీర ప్రాంతాంలోని మత్స్యకారులకు వేట నిషేధ సాయం కింద రూ.20వేలు అందజేస్తామని టీడీపీ ప్రకటించింది. తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూ.20వేలు ప్రకటించిన విషయాన్ని వర్మ గుర్తుచేశారు. త్వరలోనే వీరందరికీ పరిహారం అందబోతున్నట్లు చెప్పారు. దీంతోపాటు పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.4 లక్షల ఇంటి రుణం మంజూరు చేయబోతున్నట్లు వెల్లడించారు. మత్స్యకారులంతా ఈ రుణాన్ని పొంది సొంత ఇళ్లను నిర్మించుకోవాలని కోరారు. దళితుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదని, అంబేద్కర్ పై వారికి ఎంతో ప్రేమ ఉన్నట్లు నిరసనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వంగా గీత ఎంపీగా ఉన్న సమయంలో పిఠాపురంకు మొండిచెయ్యి చూపించిందన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

ఐదు సంవత్సరాల కాలంలో దళితులపై దాడి జరిగితే ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకులంతా ఎక్కడున్నారని వర్మ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అతి ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావించారని, అలాగే స్మృతివనంలో ఆయన బాల్యం, విద్యాభ్యాసం, ఎదుర్కొన్న వివక్షత లాంటి వివరాలన్నీ పొందుపరచాలని భావించారన్నారు. భావితరాలకు గుర్తుండేలా, శాశ్వతంగా నిలిచిపోయేలా దీన్ని తీర్చిద్దాలనుకుంటే వైఎస్ జగన్ మాత్రం విజయవాడలో తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది, మేలు కలిగేది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని, రాబోయే ఆరు నెలల కాలంలో అన్నివర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉంటారన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని సమస్యలను పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నారని, ఇందులో ఎటువంటి అపోహలు అవసరంలేదన్నారు.

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance