వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

Header Banner

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

  Wed Sep 04, 2024 09:23        Politics

భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిగురుటాకులా వ‌ణికిపోయింది. ముఖ్యంగా విజ‌య‌వాడ స‌గానికి పైగా జలదిగ్భందంలో చిక్కుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం బుడ‌మేరు వాగు వ‌ర‌ద పోటెత్త‌డ‌మే. దీంతో గ‌డిచిన నాలుగు రోజులుగా ప్ర‌జ‌లు వ‌ర‌ద‌నీటిలోనే ఉంటున్నారు. ఇక వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న‌కు తోడుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో నిత్యం ప‌ర్య‌టిస్తున్నారు. ఆహార ప‌ద‌ర్థాలు, ఇత‌ర సామాగ్రిని అందించ‌డం చేస్తున్నారు. ఇలా ప్ర‌త్య‌క్షంగా స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొంటూ సీఎం బాధితుల‌కు మేము ఉన్నామంటూ భ‌రోసా ఇస్తున్నారు. అయితే, జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. ఇక వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో జ‌న‌సేనానిని ప‌ర్య‌టించ‌క‌పోవ‌డంపై నెట్టింట విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇంత‌కుముందు ఎక్క‌డ‌ ఏ చిన్న స‌మ‌స్య ఉన్నా అక్క‌డికి వెళ్లిన ప‌వ‌న్ ఇప్పుడు ఇంత పెద్ద విల‌యం తాండ‌వం చేస్తుంటే ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేదంటూ విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ స్పందించారు. త‌న‌కు బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శించాల‌ని ఉంద‌న్నారు.

 

ఇంకా చదవండి: ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

అయితే, తాను వెళ్లిన చోట అభిమానులు, ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని, దాంతో బాధితుల‌కు ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లుగుతుంద‌ని తెలిపారు. అందుకే త‌న ప‌ర్య‌ట‌న బాధితుల‌కు స‌హాయ‌ప‌డేలా ఉండాలే త‌ప్పితే, ఆటంకంగా ప‌రిణ‌మించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక కొంద‌రు కావాల‌ని విమ‌ర్శించ‌డం త‌ప్పితే, చేసేదేమీ ఉండ‌ద‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చుర‌క‌లంటించారు. ఇదిలాఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని రూ. 50ల‌క్ష‌ల చొప్పున విరాళం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌తో పాటు తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన ప‌లువురు కూడా వ‌ర‌ద స‌హాయ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.

 

ఇంకా చదవండి: ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? జగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!

 

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pawankalayan #AndhraPradesh #APPolitics #APnews #Jagan #PawankalayanSpeech #Meeting