డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేం! వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని విరాళం ఎంతో తెలుసా?

Header Banner

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేం! వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని విరాళం ఎంతో తెలుసా?

  Thu Sep 05, 2024 10:07        Politics

భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన తెలుగు రాష్ట్రాల‌ బాధితుల‌ను ఆదుకునేందుకు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులే కాకుండా వివిధ రంగాలకు చెందినవారు త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా రూ. 6కోట్ల భారీ విరాళంతో ఉదార‌త చాటారు. ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మ‌రో రూ.కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.1ల‌క్ష చొప్పున‌ రూ.4 కోట్లు ఇస్తాన‌న్నారు. ఇలా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గొప్ప మ‌న‌సు చాటిన ప‌వ‌న్‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా వ‌ర‌ద ప్రాంత ప్ర‌జ‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ డిప్యూటీ సీఎంను అభినందించారు. 

 

ఇంకా చదవండి: వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా ప‌వ‌న్‌ను ప్ర‌శంసిస్తూ చంద్ర‌బాబు పోస్ట్ పెట్టారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు భారీ విరాళం ఇవ్వ‌డం జ‌న‌సేనాని విశాల హృద‌యానికి అద్దం ప‌డుతుంద‌ని సీఎం కొనియాడారు. ప్ర‌జల‌కు ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేమ‌ని తెలిపారు.  "వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు నా అభినందనలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణ వరద ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు చేసేందుకు మరో రూ.కోటి ఇవ్వడం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతుంది. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ క‌ల్యాణ్‌ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని సీఎం చంద్ర‌బాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance