బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం! వరదలో మునిగిన వాహనాలకు బీమా! దరఖాస్తు చేసుకునే అవకాశం!

Header Banner

బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం! వరదలో మునిగిన వాహనాలకు బీమా! దరఖాస్తు చేసుకునే అవకాశం!

  Thu Sep 05, 2024 10:34        Politics

కురిసిన భారీ వర్షాల్లో నష్టపోయిన వాహనాలు, భారీ వాహనాలకు సంబంధించి బ్యాంకర్లు ఇన్సూరెన్స్, ఈఎంఐ చెల్లింపులపై సీఎం చంద్రబాబునాయుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. భారీ వర్షాల్లో నష్టపోయిన వారిపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఈ కష్ట సమయంలో వారిని ఆదుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఏమన్నారంటే.. ఎన్నడూ చూడని విపత్తును నేడు విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నారు.తుఫాన్లు, వరదలు గతంలో వచ్చినప్పటికీ నేటి పరిస్థితి పూర్తి భిన్నం. ఆకస్మిక వరదలతో కనీసం తాగునీరు కూడా లేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నుంచి సర్వశక్తులు ఒడ్డుతున్నాం…ప్రజలకు సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాం.ఆకస్మిక వరదలతో ప్రతి ఇంట్లో వాహనాలు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీటమునిగాయి. కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామగ్రి మొత్తం నీటి పాలైంది. ఫ్రిజ్ లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయి. నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలి.. 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలి. 14 రోజుల్లో క్లెయిమ్స్ పరిష్కరించాలి. ఆన్లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలి.

 

 

వరద బాధిత ప్రాంత ప్రజల రుణాలు కాల పరిమితిని రీ షెడ్యూల్ చెయ్యాలి. యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలి. వాహనాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ డ్యామేజ్ అయ్యాయి. వదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి జీవితం కొత్తగా మొదలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వం, బ్యాంకులు, బీమా కంపెనీలు అందరం కలిసి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీతో సమావేశమయ్యాం. బీమా ఉన్న వారికి, లేని వారికి రెండు కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నాం. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్.బి.ఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ప్రభుత్వంతో పాటు బ్యాంకర్లు, ఏజెన్సీలు కూడా మానవీయ కోణంలో స్పందించాలి. 

 

ఇంకా చదవండి: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేం! వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని విరాళం ఎంతో తెలుసా?

 

గ్రామవార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్ ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మునిసిపల్ శాఖరవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లెయిమ్ లకు దరఖాస్తు చేయాలి.అన్ని శాఖల వద్ద ఉన్న డేటా మొత్తాన్ని క్రోడీకరించి…బాధితులను ఆదుకుందాం. బ్యాంకర్లు రుణాలు రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నాం. బాధితుల వివరాలను ప్రభుత్వం గుర్తించి బ్యాంకర్లకు ఇస్తుంది. బాధల్లో ఉన్న వినియోగదారులను ఆదుకోవడంలో బీమా కంపెనీలు మానవీయ కోణంతో వ్యవహరించాలి. ప్రజలు లేనిదే ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు. వారు బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే మన లక్ష్యం కావాలి.ప్రభుత్వం, బ్యాంకులు, కంపెనీలు అందరం కలిసి వరద బాధితులకు ఆక్సిజన్ అందిద్దాం. లోన్లు రీషెడ్యూల్, 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చెయ్యాలనే ప్రభుత్వం ప్రతిపాదలపై చర్చించుకుని ఒకటి రెండు రోజుల్లో రావాలని బ్యాంకర్లకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సీఎం సూచన

 

ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather