మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. అంగన్‌వాడీలలో నెల రోజులు! ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో!

Header Banner

మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. అంగన్‌వాడీలలో నెల రోజులు! ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో!

  Wed Sep 25, 2024 07:00        Politics

గ్రామీణుల్లో రోజు రోజుకు ఆరోగ్యంపై శ్రద్ధ మరిచి, రోగాలను కొని తెచ్చుకొని హాస్పిటల్ బాట పడుతూ, మెరుగైన జీవితాన్ని కొనసాగించలేక పోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణుల కోసం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో నిర్వహించాలని ఐసిడిఎస్‌కి  సిఫార్సు చేసింది. ఈ మహోన్నతమైన కార్యక్రమం గురించి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలియాలి. వారు ఈ సూచనలు పాటించే విధంగా వారిలో ఆసక్తి తీసుకోవాలని వీకోట, బైరెడ్డిపల్లి ICDS అధికారిణి మాధవిలత లోకల్ 18 ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించడమే అన్నారు. అందుకోసం  భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంని కొనియాడారు.

ఉద్దేశ్యం: సంపూర్ణ పోషకాహారం కోసం ప్రధానమంత్రి విస్తృత పథకం లేదా పోషణ అభియాన్ లేదా జాతీయ పోషకాహార మిషన్ అనేది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించడం కోసం భారత ప్రభుత్వం తెచ్చిన ప్రధాన కార్యక్రమం. పూర్వం గ్రామీణులు సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేసి, వాటిని ఆహారంగా తీసుకొనేవారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండేది.

 

ఇంకా చదవండి: అనంతపురం జిల్లాలో రథం తగులబెట్టిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం! కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో!

 

కాలక్రమేణా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు పెద్ద మొత్తంలో వాడకం, నూతన పద్ధతులు అవలంబించడం, మించిన స్థాయిలో పిచికారీ చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్నారుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో జనాలు హాస్పిటల్ బాట పడుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో గమనించిన కేంద్ర ప్రభుత్వం.. పోషణ మాసోత్సవాలు ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో నెల పాటు క్రమంగా జరిపి, ఆరోగ్యం పై శ్రద్ధ, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, చిన్నారులకు ఎటువంటి ఆహారం అందివ్వాలి, గర్భం దాల్చిన ప్రతి స్త్రీ పోషణ పై తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటి..? అన్న విషయాలు పూర్తి స్థాయిలో తెలియజేస్తోంది.

పోషణ లోపం: గ్రామాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరిచి, గర్భిణీ స్త్రీలు సరైన ఆహారం తీసుకోక పుట్టిన బిడ్డ ఏదో ఒక లోపంతో పుట్టడం, ఏదో ఒక లోపంతో తల్లి మంచాన పడటం, కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా కొట్టుమిట్టాడటం వంటివి సమాజంలో చూస్తుంటాం. వీటిని పూర్తి స్థాయిలో అధిగమించేందుకు ఈ పోషణ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నదని ICDS అధికారిణి మాధవిలత తెలిపారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

 

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples