బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

Header Banner

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

  Thu Oct 03, 2024 17:16        Politics

రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే. అయితే అదే పనిగా పార్టీలు మారుతుంటే.. అచ్చం అదే జరిగింది హర్యాణా ఎన్నికల వేళ. గంట క్రితం బీజేపీకి ఓట్లు వేయాలని బీజేపీ తరపున ర్యాలీలో ప్రసంగం చేసిన మాజీ ఎంపీ అశోక్ తన్వర్ అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి పార్టీ మారిన అశోక్ తన్వర్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న తర్వన్.. 2014-19 మధ్య కాలంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 2019లో పార్టీ పతనంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2021 లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2022 లో ఆమ్ ఆద్మీ గూటికి చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆప్ కు రిజైన్ చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి! 

 

గత లోక్ సభ ఎన్నికల్లో సిర్సా లోక్ సభ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుమారి సెల్టా చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో మరో ఐదు రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ, భూపిందర్ సింగ్ హుడా సమక్షంలో కాంగ్రెస్ లోకి వచ్చారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన కొన్ని గంటలకే తన్వర్ కాంగ్రెస్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP