వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?

Header Banner

వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?

  Sat Nov 02, 2024 15:04        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. తాజాగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించింది. ఇదే సమయంలో పెన్షన్ల పైన చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. పెన్షన్ల అమలు విషయంలో వార్డు, గ్రామ సచివాలయాలకు చంద్రబాబు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో, ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి పైన సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచింది. ప్రతీ నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను మొదటి నెల, రెండోనెలా తీసుకోకున్నా.. మూడో మాసంలో స్వేచ్ఛగా తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎవరైనా ఇవ్వకుంటే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపిచ్చారు. గ్రామ.. వార్డు సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గౌరవంగా పింఛన్‌ అందించాలని.. ఎవరైనా ఇంటి వద్ద కాకుండా ఆఫీసు వద్ద ఇస్తే వారి భరతం పడతానని హెచ్చరించారు.

 

ఇంకా చదవండి: ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

 

ఈ నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. ప్రతీ నెలా 64 లక్షల మందికి 2,400 కోట్ల చెల్లిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అయితే, గతంలో వైసీపీ హయాం లో వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేసే వారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల తో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసారు. ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని.. వారి గౌరవ వేతనం రూ 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ ప్రతిపాదన అమలు దిశగా చర్చ జరిగింది. అయితే, అవసరమైన మేరకే వాలంటీర్ల సేవలను ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేసి వినియోగించుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పుడు నాలుగు నెలల పాలన పూర్తయినా వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి.... పంచాయితీల పరిధిలోనే వారి సేవలు ఉండేలా మరో ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను అందరినీ కొనసాగించాలా లేదా అనేది ఇంకా తుది నిర్ణయం జరగలేదు. దీంతో.. వాలంటీర్లు పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల హామీ అమలు చేయాలని నినదిస్తున్నారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మరో సారి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని చెప్పటంతో.. ఇప్పుడు వాలంటీర్ల గురించి తిరిగి చర్చ మొదలైంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా.. ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews