ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!

Header Banner

ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!

  Fri Nov 08, 2024 08:18        Politics

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా సరే రైతులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రైతు సంక్షేమం దిశగా అడుగులు వేసే సర్కార్ వస్తే తమ కష్టాలు తీరుతాయని ఎదురు చూస్తుంటారు. అయితే నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రైతులకు భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే కాదు రైతు సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు సర్కార్ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు అందించే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా పామాయిల్ రైతులు సరైన కిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో రైతులకు భారీ ఊరట లభిస్తుందన్నారు. ఆయిల్‌పామ్‌ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను పామాయిల్ ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరిగిందని రైతులు అంటున్నట్లు తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు! చలికాలంలోనూ వర్షాలతో వణికిస్తున్న బంగాళాఖాతం! ఆ జిల్లాల వారు జాగ్రత్త!

 

అయితే దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పాలనలో ఒకానొక సందర్భంలో పామాయిల్ టన్నుకు గరిష్ఠంగా రూ.23 వేల పెరిగి.. అతి తక్కువ కాలంలోనే టన్ను ధర రూ. 12 వేలకు పడిపోయింది. దీంతో ముందుగా అడ్వాన్స్‌లు తీసుకున్న రైతులు భారీగా నష్టపోయారని తెలిపారు. తాజా పరిస్థితుల కారణంగా పామాయిల్ ధర టన్నుకు రూ.6,500 పెరిగిందని కొందరు అంటున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో ప్రస్తుతం టన్ను పామాయిల్ ధర రూ.19,000లకు చేరిందని రైతులు తెలిపారని మంత్రికి సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. అయితే రైతులకు సరైన గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు మాటిచ్చారు. పామాయిల్ ధర టన్నుకు రూ. 19,000 ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో మరింతగా పామాయల్ సాగును విస్తరించేలా చేయాలంటూ అధికారులకు మంత్రి ఆదేశించారు. త్వరలోనే పామాయిల్ ధరను నిర్ణయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టన్నుకు రూ.19,000 అందించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి ధర నిర్ణయిస్తామన్నారు. అంతేకాదు కేంద్రం కూడా పామాయిల్ రైతులకు భారీగా చేయూతనిస్తోంది. ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు ఇటీవలే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews