చంద్రబాబు Vs జగన్! పీఏసీ ఛైర్మన్ దక్కేదెవరికి, బిగ్ ట్విస్ట్! కీలకంగా భావించే ప్రజా పద్దుల కమిటీ!

Header Banner

చంద్రబాబు Vs జగన్! పీఏసీ ఛైర్మన్ దక్కేదెవరికి, బిగ్ ట్విస్ట్! కీలకంగా భావించే ప్రజా పద్దుల కమిటీ!

  Thu Nov 21, 2024 15:46        Politics

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ పదవి ఎన్నిక కూటమి - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ పదవికి సంబంధించి ఈ మధ్నాహ్నం వరకు నామినేషన్లకు సమయం ఉంది. సంఖ్య పరంగా వైసీపీకి ఈ పదవి దక్కదు. కానీ, ప్రతిపక్షానికే ఈ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలంతో పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. అనూహ్య నిర్ణయాలు జరిగితే మినహా ఈ పదవి వైసీపీకి దక్కే ఛాన్స్ లేదు. దీంతో, ఈ ఎన్నికలో చోటు చేసుకునే పరిణామాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. కీలకంగా భావించే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి సహజంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయిస్తారు. కానీ, ఇప్పుడు వైసీపీకి ఆ పదవి దక్కే ఛాన్స్ కనిపించటం లేదు. ఛైర్మన్ పదవితో పాటుగా సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పదవుల కోసం నేడు (గురువారం) మధ్నాహ్నం లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏకగ్రీవం కాకుండా.. పోటీ ఉంటే రేపు (శుక్రవారం) ఎన్నిక జరగనుంది. ఎన్నిక జరిగితే సభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా కూటమికే ప్రధాన పోస్టులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

 

ఇంకా చదవండి: శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

దాదాపు 60 ఏళ్లుగా పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతోంది. 2019లో టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్న సమయంలో.. పీఏసీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. పీఏసీ తో పాటు ఇతర కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి తరపున మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో, మండలిలో లోకేష్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. మండలి నుంచి ప్రతి కమిటీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకునేందుకు వీలుగా రూల్‌ 263 ద్వారా తీర్మానం ప్రవేశపెడు తున్నట్టు తెలిపారు. అయితే, వైసీపీ ఈ ఎన్నిక సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టిడిపి కాకుండా ఎక్కువ స్థానాలు ఉన్న జనసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని, అందువల్ల అనవాయితీ ప్రకారం ఈపదవి వైసిపికి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మండలిలో వైసీపీకి సంఖ్య పరంగా బలం ఉండటంతో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, ప్రజా పద్దుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి ముగ్గురు సభ్యులుగా నియమితులవుతారు. గత శాసనసభలో టీడీపీకి ఒక్క సభ్యుడినే ఎన్నుకొనే అవకాశం ఉండటంతో కేశవ్ కు అవకాశం దక్కింది. ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం ఉంది. అయితే, మండలి సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ గా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చర్చగా మారింది. శాసనసభలో వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఆ పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి దక్కదనేది కూటమి నేతల వాదన. దీంతో, జనసేనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక.. ఇప్పుడు పీఏసీ ఛైర్మన్, సభ్యుల విషయంలో ఎలాంటి రాజకీయం చోటు చేసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా? కొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews