తుపానులా మారుతున్న పవన్ కళ్యాణ్.. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ! ఇది ఆరంభం మాత్రమే..

Header Banner

తుపానులా మారుతున్న పవన్ కళ్యాణ్.. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ! ఇది ఆరంభం మాత్రమే..

  Wed Nov 27, 2024 19:31        Politics

ప్రస్తుతం ఢిల్లీలో ఉంటూ.. కీలక మంత్రులు, నేతల్ని కలుస్తూ.. ఏపీకి రావాల్సిన నిధులపై అడుగుతున్న పవన్ కళ్యాణ్.. మరోవైపు.. రాజకీయంగా కూడా.. తన స్థాయిని పెంచుకుంటున్నారు. నెక్ట్స్ జరగబోయే.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేయించుకోవాలని బీజేపీ ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆయన వేస్తున్న ప్రతీ అడుగు.. కేంద్రంలో ఆయన ప్రాధాన్యాన్ని పెంచుతూనే ఉంది. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ తర్వాత.. నేషనల్ లెవెల్‌లో మరింత హైలైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి భేటీలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర సహకారంపై ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ మాట్లాడతారని తెలిసింది. అలాగే.. జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఏపీకి రావాల్సిన నిధులను కోరనున్నారు.

 

ఇంకా చదవండి: వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ పథకాన్ని కొనసాగించాలని కోరతారని తెలిసింది. ఇప్పుడు ఏపీలో తాగు నీటి సరఫరా శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు జరగనుంది. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని కోరనున్నట్లు తెలిసింది. నిన్న పవన్ కళ్యాణ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిశారు. ఏపీ పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక యూనివర్శిటీ వంటి ఏడు అంశాలపై చర్చించారు. ఏపీకి ఉన్న సముద్ర తీరాన్ని టూరిజం కోసం అభివృద్ధి చేసే అంశంపై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం టూరిజంపై ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది. కేంద్రం సహకారం అందించి, భారీగా నిధులు ఇస్తే.. ఏపీ మళ్లీ టూరిజం ఎట్రాక్షన్‌గా మారగలదు.

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP