శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

Header Banner

శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

  Sun Jan 26, 2025 09:10        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం.. కీలకమైన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. తాజాగా.. పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసింది. ఇళ్లతోపాటూ.. అర్హులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు.. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నట్లు ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. 

 

ఫిబ్రవరి 1న తణుకు మండలంలోని తేతలిలో.. సీఎం చంద్రబాబు ద్వారా.. ఇళ్లను పొందే లబ్దిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది అని మంత్రి తెలిపారు. ఆ రోజున ఏపీ వ్యాప్తంగా 1 లక్షా 14 వేల ఇళ్లను ప్రతీ నియోజకవర్గంలో.. ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు కలిసి.. లబ్దిదారులకు ఇస్తూ.. తాళాలు అందజేస్తారని మంత్రి వివరించారు. అందువల్ల ఫిబ్రవరి 1న లబ్దిదారులు.. కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు చేస్తారు అనుకోవచ్చు. 

 

అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా ఇల్లు ఉండాల్సిందే అని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. గత వైసీపీ పాలనలో.. నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చెయ్యకుండా.. నిర్లక్ష్యంగా వదిలేసి, లబ్దిదారులకు అవి దక్కకుండా కుట్రలకు పాల్పడ్డారనీ, కొత్త ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బు లేకపోయినా, వచ్చే రెవెన్యూతో జాగ్రత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి వివరించారు. అర్హులందరికీ తప్పనిసరిగా ఇళ్లు ఇస్తామన్నారు. 

 

ఇంకా చదవండివిజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ అధిష్టానం! సంచలన వ్యాఖ్యలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇళ్ల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో కేంద్రం రూ.4,500 కోట్లు ఇచ్చిందనీ, కానీ ఆ డబ్బును మాజీ సీఎం జగన్.. పక్కదారి పట్టించారని మంత్రి తెలిపారు. ఇప్పుడు రూ.502 కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం ఆరు నెలల్లో ఖర్చుపెట్టాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లు పూర్తి చెయ్యడానికి కేంద్రం 2025 డిసెంబర్ వరకూ అనుమతి ఇచ్చిందన్న మంత్రి.. ఆ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. 

 

ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందన్న మంత్రి పార్థసారథి.. ఇసుక కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల 19 లక్షలు ఇచ్చిందని తెలిపారు. తద్వారా.. త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయి అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారికి గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..

 

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..

 

ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

 

ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..

 

రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!

  

ఎమ్మెల్యే పై టమాటాలుగుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP