మహిళలకు బంపరాఫర్.. ఉచిత బస్సు ప్రయాణం హామీకి గ్రీన్ సిగ్నల్! కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం!

Header Banner

మహిళలకు బంపరాఫర్.. ఉచిత బస్సు ప్రయాణం హామీకి గ్రీన్ సిగ్నల్! కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం!

  Wed Jan 29, 2025 18:58        Politics

ఏపీలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని టీడీపీ నేతలు సూపర్ సిక్స్ పథకాల పై హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు ప్రారంభించారు. ఇక, అమ్మఒడి .. అన్నదాత సుఖీభవ పథకాల పైన తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. మరో హామీగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వం కసరత్తు
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు పైన ప్రభుత్వం తొలుత అధికారుల నుంచి నివేదిక కోరింది. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో విధి విధానాలు.. ఆర్దిక భారం.. నష్టాల గురించి పూర్తి సమాచారంతో అధికారులు నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సమస్యలు.. సిబ్బంది కొరత గురించి వివరించారు. కొత్త బస్సులతో పాటుగా సిబ్బంది నియామకం తోనూ ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుందని నివేదించారు. కాగా, నెలకు రూ. 180 కోట్ల వరకు ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రీయంబర్స్ చేయాల్సి ఉంటుందని నివేదిక లో స్పష్టం చేసారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల! 


పథకాలు - ఆర్దిక కష్టాలు
ఇక, ప్రభుత్వం ఇదే అంశం పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ సభ్యులు కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలు పైన క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షించారు. మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశమైన ఈ పథకం గురించి చర్చలు చేసారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి, అమలు ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. వచ్చే విద్య సంవత్సరం లో అమ్మ ఒడి... కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధుల వేళ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


ఉగాది నుంచి అమలు
అయితే, మహిళకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పైన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉగాది నుంచి ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ పథకం పై అధ్యయనం చేస్తున్న ముగ్గురు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీనిని పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ లోనూ ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశం ఉంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

 

తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!

 

డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!

 

దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..

 

షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టునంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

 

శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!

 

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #freebus #women #ap #todaynews