సింహాచలం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం..! టీడీపీ నిర్ణయంతో 12,149 కుటుంబాలకు న్యాయం!
Wed Jan 29, 2025 20:06 Politicsఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత, భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. మంత్రి అనగాని మాట్లాడుతూ.. “ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తున్నాం. సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతోంది. దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. గతంలో (2018-19)లో జీవో నెం.225 ఇచ్చాం. ఎంత భూమి ఆక్రమణకు గురైందో.. దానికి సమానంగా భూమి ఇచ్చేందుకు ఆనాడు నిర్ణయించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
జీవో రాగానే కొంత మంది కోర్టుకు వెళ్లారు. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేకపోయింది. సుమారు 12,149 కుటుంబాలకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా వైకాపా ప్రభుత్వం చేయలేకపోయింది. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారు. వాటి క్రమబద్ధీకరణకు గతంలోనూ ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు (సమాన రిజిస్ట్రేషన్ విలువతో) సింహాచలం దేవస్థానానికి బదలాయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీని రిజిస్ట్రేషన్ విలువ రూ.5,300 కోట్ల వరకూ ఉంది. పెదగంట్యాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాల భూమి ఇస్తున్నాం. దేవస్థానానికి చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమి ఇస్తున్నాం. గాజువాకలో ఇనాం భూమిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నాం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెదేపా హయాంలో ఇచ్చిన డీడ్‌ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే పట్టాలు ఇచ్చి రెండేళ్లలోనే శాశ్వత హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ అంశంపై గురువారం కౌంటర్ దాఖలు చేయబోతున్నాం. కోర్టులో మాకు సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం. తీసుకున్న భూమికంటే ఎక్కువ విలువ ఉండేలా.. అందరికీ వెసులుబాటు కలిగించేలా నిర్ణయం తీసుకుంటున్నాం. రానున్న రెండు మూడు నెలల్లో పరిష్కార మార్గం లభిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #kutami #minister #land #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.