ఏపీ మహిళలకు త్వరలోనే శుభవార్త! అప్పటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం!
Thu Jan 30, 2025 07:00 Politicsఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. ఏపీ ఎన్నికల సమయంలో మహిళల కోసం అనేక హామీలు ప్రకటించిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళల కోసం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి మండిపల్లి చెప్పారు.
ఇంకా చదవండి: కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మండిపల్లి తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉచిత బస్సు పథకం అమలవుతున్న కర్ణాటకలో ఇప్పటికే పర్యటించామన్న మంత్రి మండిపల్లి.. అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసినట్లు, కర్ణాటక రవాణాశాఖ అధికారులతో వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను తయారు చేసిందని.. ఈ రిపోర్టును ప్రభుత్వానికి అందించినట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఆరో తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై ఏపీ ప్రభుత్వం చర్చిస్తుందని.. ఆ తర్వాత ఉగాది నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.