రైతులకు తీపికబురు చెప్పిన చంద్రబాబు.. ఆ పంట వేసిన వారికి ఇక పండగే! దీంతో పాటుగా పంటలకు ఉచిత బీమా..
Thu Jan 30, 2025 12:10 Politicsసీఎం చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లోని కొబ్బరి రైతులకు భారీ శుభవార్తను అందించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి చెట్లకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ప్రస్తుతం 9 జిల్లాల్లో అమల్లో ఉంది. రైతులు ప్రీమియం చెల్లిస్తే, వారికి ప్రకృతి విపత్తులు, చీడపీడలు, అగ్నిప్రమాదాల వల్ల కలిగే నష్టానికి బీమా రక్షణ కల్పించనున్నారు. బీమా ప్రీమియంలో భాగస్వామ్యం చేస్తుంది. 75% ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కొబ్బరి అభివృద్ధి మండలి భరించనుంది. 25% ప్రీమియాను రైతులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా తుపానులు, భారీ వర్షాలు, పిడుగులు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, అగ్నిప్రమాదాలు, చీడపీడలు వంటి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు.
ఇంకా చదవండి: భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
4 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల కొబ్బరి చెట్లకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. డ్వార్ఫ్, హైబ్రిడ్, టాల్ రకాలకు చెందిన చెట్లు బీమా పొందే అర్హత కలిగి ఉంటాయి. చెట్ల వయస్సును బట్టి ప్రీమియం రేట్లు నిర్ణయించబడతాయి. సకాలంలో ప్రీమియం చెల్లిస్తే, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతామనే భయం ఉండదని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. బీమా సంబంధిత మరింత సమాచారం కోసం స్థానిక వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పొలాలకు భద్రతా గాలం వేసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో పాటుగా పంటలకు ఉచిత బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇటువంటి పథకాలు రైతులను విపత్తుల కాలంలో భారీగా ఆదుకోనున్నాయి.రైతులు వారు ఏ పంట వేసినా సరే బీమా తీసుకోవడం అనేది ఉత్తమం.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.