కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు! ఇక 45 రోజుల పాటు..
Thu Jan 30, 2025 12:21 Politicsప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేయడం జరిగింది.
ఇంకా చదవండి: భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని అందులో కోరారు. కాగా, ఈ పిటిషన్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టేటస్ రిపోర్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాలో నిన్నటి వరకే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి సర్కార్ వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40కోట్ల మంది వరకు భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #MahakumbhMelaStampede #SupremeCourt #Prayagraj #UttarPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.