జగన్ బంధువుకు బైరైటీస్ గనుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహం! సెలవు రోజుల్లో సీక్రెట్ డీల్?

Header Banner

జగన్ బంధువుకు బైరైటీస్ గనుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహం! సెలవు రోజుల్లో సీక్రెట్ డీల్?

  Thu Jan 30, 2025 17:19        Politics

వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ బంధువు వెంకట్రెడ్డికి బైరైటీస్ గనుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 14 వరకు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో గనుల శాఖ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం.. జీఏడీ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు అప్పగించింది. ఏపీ ఎండీసీ ఎండీ బాధ్యతలను కూడా ముఖేష్ కుమార్ మీనాకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగిందంటే?..
జగన్ కు వరుసకు సోదరుడు, పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి.. సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్సార్ జిల్లా వేములలో దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి (బెరైటీస్) నిల్వలున్న లీజును కట్టబెట్టింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 



సెలవు రోజుల్లో, ఈనెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనులశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ఫైలు ఆగమేఘాలపై కదలడం వెనుక వైఎస్సార్ జిల్లాకు చెందిన తెదేపా ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు సమాచారం. వేములలో సర్వే నంబర్లు 1021/26, 43ల్లో 11.6 హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకటరెడ్డి 2016లో దరఖాస్తు చేసుకున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలింది. 9.55 హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనులశాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు. గనులశాఖ అప్పటి సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ లీజు ఫైల్పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 ఏళ్ల కాల వ్యవధితో లీజు మంజూరుచేస్తూ ఈనెల 15న డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వు జారీచేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #jagan #mining #todaynews #flashnews #latestupdate