ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్‌లో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు! కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం!

Header Banner

ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్‌లో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు! కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం!

  Thu Jan 30, 2025 18:06        Politics

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) 3వ సమావేశం ప్రారంభమైంది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనున్నారు. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా ఇందులో చర్చించనున్నారు.  ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 



అధికారులు, మంత్రులు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి తెలిపారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #APCM #CBN #investiment #projects #sanction #todaynews #flashnews #latestupdate