40 శాతానికి పైగా రిటర్న్స్ అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇవే! పూర్తి వివరాలు మీకోసం!

Header Banner

40 శాతానికి పైగా రిటర్న్స్ అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇవే! పూర్తి వివరాలు మీకోసం!

  Mon Dec 16, 2024 19:45        Business

ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, పిల్లల అవసరాల కోసం తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. అలా పొదుపు చేసిన మొత్తం వేర్వేరు పెట్టుబడి, మదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రత్యేకించి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, ఆడపిల్లల పెండ్లిండ్ల కోసం ఈ పెట్టుబడులు కొనసాగుతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు, బంగారం కొనుగోళ్లు, రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) కింద ప్రతి నెలా క్రమం తప్పకుండా మదుపు చేస్తే గడువు ముగిసే నాటికి మంచి రిటర్న్స్ ఇస్తాయి. 2024లో సుమారు 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ పెట్టుబడులపై 40 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి. 150కి పైగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 20 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి. ఈ ఏడాది కాలంలో ఇన్వెస్టర్లు 268 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులు పెట్టారు.

 

ఇంకా చదవండిఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్‌లో నాలుగు టాప్ స్కీమ్స్ ఇందులో చోటు దక్కించుకున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 60.78 శాతం, మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 54.72 శాతం రిటర్న్స్ అందించాయి. మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ 49.23 శాతం, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 48.72 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లకు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 46.44 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లో పెట్టుబడులపై 45.99 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఇన్ వెస్కో మ్యూచువల్ ఫండ్ లో మూడు స్కీమ్స్ మంచి రిటర్న్స్ అందించాయి. ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ 45.06 శాతం, ఇన్ వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 42.29, ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ 40.88 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.03 శాతం రిటర్న్స్ అందించింది. మరో 258 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ -0.98 శాతం నుంచి 39.84 శాతం మధ్య రిటర్న్స్ అందించాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

  

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #MutualFunds #Equity