బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోవాలి! ఇది లేకుండా కొని మోసపోవద్దు!

Header Banner

బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోవాలి! ఇది లేకుండా కొని మోసపోవద్దు!

  Thu Dec 19, 2024 20:29        Business

భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. దీనిని కొనుగోలు చేసి ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ఇది మహిళల అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. బంగారానికి సాధారణంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాల్ని తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ రూపంలో లభిస్తుంది. అయితే.. బంగారం కొనేముందు కచ్చితంగా కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగారం ధర.. ఇదెప్పుడూ స్థిరంగా ఉండదు. స్వల్ప కాలంలోనే చాలా హెచ్చుతగ్గులుంటాయని తెలుసుకోవాలి. బంగారం ధరను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందుకే.. కొనే ముందు ఒకట్రెండు షాపుల్లో ధరల్లో తేడా చూడాలి. ఇంకా విశ్వసనీయ వెబ్‌సైట్లలో కూడా చెక్ చేసుకోవచ్చు. 

 

ఇంకా చదవండిబయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ! నెల రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. 

 

బంగారు ఆభరణాల్ని, బిస్కెట్స్, బార్స్ కొనేముందు స్వచ్ఛత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 22 క్యారెట్లు, 24 క్యారెట్లు తేడా గమనించాలి. హాల్ మార్కింగ్ అత్యంత కీలకం. హాల్ మార్క్ అనేది బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది. గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు.. భారత ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణం కచ్చితంగా హాల్ మార్కింగ్ అయి ఉండాలి. లేకపోతే స్వచ్ఛతపై స్పష్టత ఉండదు. ఇక్కడ నకిలీది కొని మోసపోయే ప్రమాదం ఉంటుంది. బంగారు ఆభరణాలకు కచ్చితంగా హాల్ మార్క్ ఉండాలని కేంద్రం ఎప్పుడో స్పష్టం చేసింది. కాబట్టి ముందే జాగ్రత్తపడాలి. 

 

ఇంకా చదవండి: సర్దార్ గౌతు లచ్చన్నపై గౌరవంతోనే వైకాపా నాయకుడు వచ్చినా భరించాం! తెదేపా నేతలు సహకారంపై...!

 

హాల్ మార్కింగ్‌లో బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత, ఆరంకెల హెచ్‌యూఐడీ ఉంటుంది. ఇది లేకుంటే బీఐఎస్ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. హాల్ మార్కింగ్ లేకుండా బంగారం కొంటే మోసపోయినట్లే. గోల్డ్ జువెలరీపై ఉండే హెచ్‌యూఐడీని బీఐఎస్ యాప్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా షాపును బట్టి.. గోల్డ్ జువెల్లరీ డిజైన్‌ను బట్టి తయారీ ఛార్జీలు మారుతుంటాయి. బంగారాన్ని కాయిన్స్ రూపంలో కొంటే.. అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వరకు ఛార్జీల్ని విధిస్తారు. ఇక్కడ కొంత తయారీ రుసుముగా,, కొంత తరుగు రూపంలో వసూలు చేస్తారు. 24 క్యారెట్స్ గోల్డ్ కోసం బ్యాంకుల్ని కూడా సంప్రదించొచ్చు. గోల్డ్ జువెల్లరీ కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, తరుగు, హాల్ మార్కింగ్ ఛార్జీలు పడతాయి. అయితే తిరిగి విక్రయించే సమయంలో ఇవేమీ వర్తించవు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకాబెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Gold #GoldRates #GoldInAndhraPradesh #Ornaments #Jewellery #GoldOrnaments