జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
Thu Jan 30, 2025 09:00 Businessఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఆమె వరుసగా ఎనిమిదో సారి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. ఈ రికార్డు ఇప్పటికే ఆమె పేరుతో ఉంది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఊరట.. రైతులకు వరాలు.. మహిళలకు లబ్ధి వంటి వరాలు ఉండొచ్చన్న అంచనాలతో సహా పరిశ్రమ వర్గాల నుంచి కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. క్యాలెండర్ ఇయర్‌ను ఆర్థిక సంవత్సరంగా మార్చాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్లోనే దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఎందుకు తెస్తున్నారు.. వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు.. ఏం లాభాలు ఉండొచ్చు.
మన దేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. ఇతర చాలా దేశాల్లో క్యాలెండర్ ఇయర్ అయిన జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న దానినే ఆర్థిక సంవత్సరంగా కూడా పరిగణిస్తున్నాయి. మన దగ్గరే ఇలా క్యాలెండర్ ఇయర్, ఆర్థిక సంవత్సరం వేర్వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. మన దగ్గర కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నారు.
ఇంకా చదవండి: కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇలా ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్‌కు మార్చినట్లయితే.. పాలనా సామర్థ్యం పెరగడంతో పాటు.. వ్యక్తులకు, వ్యాపారులకు మరింత స్పష్టత కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మల్టీ నేషనల్ కంపెనీలకు (బహుళ జాతి కంపెనీలు), NRI లకు కూడా ఈ విధానం అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంకా క్యాలెండర్ ఇయర్‌కు అనుగుణంగా పన్ను గడువు తేదీలు, ఆర్థిక ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలన్న డిమాండ్ విషయంలో ఏకాభిప్రాయం మాత్రం లేదు. కొందరి నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇలా ఆర్థిక సంవత్సరం విధానం మారిస్తే.. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు నిపుణులు. కొత్త పన్ను తేదీల్ని బట్టి దానికి అనుగుణంగానే టాక్స్ పేయర్స్, వ్యాపారులు తమ ప్రణాళికల్ని సర్దుబాటు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు పడొచ్చని అంటున్నారు. ఒక్కసారిగా ఆర్థిక సంవత్సరం మారితే.. అప్పుడు మారిన తేదీలకు అనుగుణంగా ముందుగానే రిటర్న్స్ దాఖలు చేయడం, కొత్తగా పన్ను లెక్కలు వేసుకోవడం వంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తలెత్తొచ్చని పలువురు పేర్కొంటున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #India #Business #TaxPayers #IncomeTax
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.