32,000 రైల్వే ఉద్యోగాలు! దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం! ఇ అవకాశం మిస్ కాకండి!
Thu Jan 23, 2025 11:33 Employmentఇండియన్ రైల్వేస్లో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. గ్రూప్ డి పోస్టుల కోసం ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 32 వేల ఖాళీల భర్తీకై దరఖాస్తు ప్రక్రియ ఇవాళ జనవరి 23 నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ రైల్వేలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుంది. మొత్తం 32, 438 ఖాళీల్ని భర్తీ చేసేందుకు జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులయినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఆర్ఆరిబి అధికారిక వెబ్సైట్ https://www.rrbcdg.gov.in/.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది.
ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?
కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 36 ఏళ్లుండాలి. రిజర్వ్ కేటగరీ అభ్యర్ధులకు - నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. కనీస, గరిష్ట వయస్సు జనవరీ 1, 2025 నాటికి లెక్కిస్తారు. అయితే మనిషి శరీర దారుఢ్యం అవసరం. పురుషులు 35 కిలోల బరువుతో 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. 1000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే మహిళలయితే 20 కిలోల బరువుతో 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. 1000 మీటర్ల దూరాన్ని5 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇవాళి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించవచ్చు. ముందుగా అప్లికేషన్ నింపి నిర్ణీత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు అయితే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈబీసీ కేటగరీ విద్యార్ధులకు, మహిళలకు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే డివిజన్లలో ఈ రిక్రూట్మెంట్ జరగనుంది. రెండు రకాల పరీక్షలతో ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ఒకటి ఉంటుంది. రెండవది ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!
జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!
నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!
రూ.10 వేల పెట్టుబడితో 17 లక్షల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #Indian #railway #GroupD #post #application #applysdate #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.