నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు!
Mon Jan 27, 2025 13:46 Employmentడిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రం పలు ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. సెంట్రల్ బ్యాంక్, ఢిల్లీ టీచర్ రిక్రూట్మెంట్, ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్ తదితర జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వచ్చే నెల మొదటి వారం వరకు దరఖాస్తు గడువు ఉంది. ఇంకెందుకు ఆలస్యం నోటిఫికేషన్ నిశితంగా చదివి మీకు సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
సెంట్రల్ బ్యాంక్ లో..
జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో అహ్మదాబాద్ 123, చెన్నై 58, గువహటి 43, హైదరాబాద్ లో 42 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 9వ తేదీతో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ, వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంకా చదవండి: ఉద్యోగులకు సూపర్ న్యూస్! కొత్త లేబర్ కోడ్ వచ్చేస్తోంది! ఇక వారానికి నాలుగు రోజులే పని!
రైల్వేలో 1036 పోస్టులు..
పన్నెండో తరగతి (ప్లస్ టూ) పూర్తిచేసిన అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 7 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. వచ్చే నెల 6వ తేదీతో గడువు ముగియనుంది. దరఖాస్తు చేయడానికి కనీస విద్యార్హత 12వ తరగతి.. పోస్టులనుబట్టి బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ, టీచర్ రిక్రూట్మెంట్ కోసం B.Ed, D.El.Ed లేదా TET ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని రైల్వేశాఖ సూచించింది.
ఒడిశా పోలీస్ శాఖలో..
ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 933 ఎస్ఐ, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.35,400 జీతం అందుకుంటారు. భారత పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. అయితే, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూల్స్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. దీంతోపాటు 432 పీజీటీ పోస్టుల భర్తీకి ఢిల్లీ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: వైసీపీకి మరో షాక్.. సాక్షిపై పరువు నష్టం కేసు! నారా లోకేష్ కీలక నిర్ణయం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #GovernmentJobs #AndhraPradesh #APPeoples #Unemployment #Jobapplication
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.