కుల రాజకీయాలను రెచ్చగొట్టి... విభజించు పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న వైసీపీ...

Header Banner

కుల రాజకీయాలను రెచ్చగొట్టి... విభజించు పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న వైసీపీ...

  Tue Feb 06, 2024 16:56        Exclusives

వైసీపీ అధినేత రాబోయే ఎన్నికలలో కుల మత వైశ్యాలను రెచ్చగొట్టే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు.

ఈయన ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని సామాజిక వర్గాల పై ఉక్కు పాదం మోపుతున్నారు.

వీరిలో ప్రధానంగా చెప్పుకోదగిన కులాలు కమ్మ, కాపు, బ్రాహ్మణ క్షత్రియ కులాలుగా చెప్పవచ్చు.

ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ కులానికి ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ఈయన రాబోయే ఎన్నికలలో కూడా టికెట్ల కేటాయింపులో కమ్మ కులానికి తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కమ్మకుల ఆధిపత్యం కలిగిన కృష్ణ, గుంటూరు జిల్లాలలో వారిని రాజకీయంగా తొక్కడమే లక్ష్యంగా ఈయన పావులు కదుపుతున్నారు.

క్షత్రియ సామాజిక వర్గానికి కూడా ఈయన తన వైసిపి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా చూస్తున్నారు.

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును రాష్ట్రములో అడుగుపెట్టనీయకుండా ఈయన ఐదేళ్లు శాసించారు.

కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో కూడా ఎంతోకాలంగా పోటీ చేస్తున్న కమ్మ, కాపు, బ్రాహ్మణ కులాలకు చెందిన అభ్యర్థులకు ఈయన మొండి చేయి చూపిస్తున్నారు.

వైసిపి పార్టీలో ఉన్న ఏకైక బ్రాహ్మణ కులానికి చెందిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మల్లాది విష్ణు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉన్న ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా వేరే కులానికి ఆ సీటును ఈయన కేటాయించారు.

విశాఖ జిల్లాలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ వైసిపి పార్టీలో కరుడుగట్టిన నాయకునిగా పనిచేస్తూ వచ్చారు.

విశాఖపట్నంలో సీటు వస్తుందని ఆశించి ఓడిపోతానని తెలిసిన ఈయన మాట కాదనకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

రాబోయే ఎన్నికల్లో సీతమ్మరాజు సుధాకర్ కు కూడా ఈయన మొండి చేయి చూపించారు.

దీంతో వైసిపి పార్టీలో బ్రాహ్మణులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది.

ఇప్పటికే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం, రధాలు దగ్ధం, విగ్రహాలు ధ్వంసం వంటి అనేక హిందూ వ్యతిరేక చర్యలతో బ్రాహ్మణులు విసిగిపోయి ఉన్నారు.

ఈయన ప్రభుత్వంలో క్రైస్తవ మతానికి ఇచ్చిన ప్రాధాన్యత హిందూ మతానికి ఎక్కడ లేకపోవడం పై హిందువులు ముఖ్యంగా బ్రాహ్మణులు ఆగ్రహంతో ఉన్నారు.

రాష్ట్రంలో అగ్రకులంగా పేరుందిన బ్రాహ్మణులకు చట్టసభలలో స్థానం కల్పించకపోవడం పై బ్రాహ్మణులు గుర్రుగా ఉన్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ద్వేషాన్ని కమ్మ కులం పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ద్వేషాన్ని కాపు కులం పైన, ఈయన పెంచుకున్నారు.

దీంతో రాష్ట్రంలో ఆయా కులాలను రాజకీయంగా అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ లౌకిక పాలన చేయవలసిన ముఖ్యమంత్రి విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఉన్నత వర్గాలను ఒక వైపు బడుగు బలహీన వర్గాలను మరకవైపు నిలబెట్టి అధికారాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బహిరంగ సభలలో కూడా ఈయన పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ ఉన్నత వర్గాలను బడుగు బలహీన వర్గాలను విభజించే కుట్రలు పన్నుతున్నారు.

కులాలు మతాలు వేరైనా అంతా కలిసి నడిస్తేనే ఒక మంచి సమాజం ఏర్పడుతుందన్న సందేశాన్ని పాలకులు విస్మరించి విభజించి పబ్బం గడుపుకోవాలనే కుట్రలు పన్నుతున్నారు.

రాష్ట్రంలో ఈయన విధ్వంసకర పాలనతో కులమతాలకతీతంగా ప్రజలు పోరాటాలు చేస్తూ రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బీసీలను విభజించడానికి కమ్మ, కాపులు ప్రాతినిధ్యం వహించే పలు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో బీసీలకు టికెట్లు కేటాయించి ఆయా వర్గాల మధ్య విభజనకు ఈయన కుట్రలు పన్నుతున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉన్న వాటిని 24 శాతానికి తగ్గించడంతో బీసీలకు ఈయన చేసిన ద్రోహం బహిర్గతం అయింది.

ఇప్పటికే ఈయన చేసిన ద్రోహాన్ని బీసీలు గ్రహించి వైసిపి పార్టీకి దూరమయ్యారు.

ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన అనేక నిధులను దారి మళ్లించిన ఈయన పై ఎస్సీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

తన సొంత కులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఈయన ఒంటెద్దు పోకడకు విసిగిపోయి ఎంతో మంది రెడ్లు పార్టీని వదిలి బయటపడ్డారు.

రాష్ట్రంలో కులాలు మతాలను విభజించి పాలించాలనుకునే ఈయనకి రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కనీసం స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పనున్నారు.

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #CastePoliticsInAP #2024NoMoreJagan #kamma #kaapucaste #brahmincaste #ByeByeJagan #FailedCMJagan