ఈ ఊరి కోసం ఏకంగా 12 గ్రామాలను భారత్ ఎందుకు ఇచ్చింది? అంత ప్రత్యేకమైనది అక్కడేముంది?

Header Banner

ఈ ఊరి కోసం ఏకంగా 12 గ్రామాలను భారత్ ఎందుకు ఇచ్చింది? అంత ప్రత్యేకమైనది అక్కడేముంది?

  Thu Feb 15, 2024 23:04        India, World

1947లో దేశవిభజన జరిగిన 14 ఏళ్ల తర్వాత... 1961లో భారత్- పాకిస్తాన్ మధ్య రెండోసారి పునర్విభజన జరిగిందని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి ఒక్క గ్రామాన్ని తీసుకొని... అందుకు బదులుగా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 12 గ్రామాలను పాకిస్తాన్‌కు రాసిచ్చింది భారత్. పాకిస్తాన్‌ నుంచి భారతదేశం తీసుకున్న గ్రామం పేరు హుస్సేనీవాలా. మరి ఈ ఊరి కోసం ఏకంగా 12 గ్రామాలను భారత్ ఎందుకు ఇచ్చింది? అంత ప్రత్యేకమైనది అక్కడేముంది? అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు.

 

ఇంకా చదవండి: విజయవాడలో ముగ్గురు బాలికలు మిస్సింగ్!! గంటలో పోలీసుల చేజ్!!

 

భారత స్వాతంత్య్ర పోరాటంలో హుస్సేనీవాలా గ్రామం చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా గ్రామంలోనే మన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల సమాధులు ఉన్నాయి. 1931 మార్చి 23న బ్రిటిష్ వారు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను లాహోర్ జైలులో ఉరితీసి... వారి మృతదేహాలను హుస్సేనీవాలా గ్రామం సమీపంలోని సట్లెజ్ నది ఒడ్డున హడావుడిగా దహనం చేశారు.

 

ఇంకా చదవండి:  అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన!

 

సగం కాలిపోయిన మృతదేహాలను సట్లెజ్ నదిలో విసిరేశారు. 1947లో భారతదేశం విడిపోయినప్పుడు హుస్సేనీవాలా గ్రామం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లింది. విభజన హడావుడిలో హుస్సేనీవాలా చారిత్రక ప్రాముఖ్యతను ఎవరూ పట్టించుకోలేదు. అనంతరం అమరవీరుల కుటుంబాలు, స్థానికులు ఈ గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉద్యమం ప్రారంభించారు. ఆ క్రమంలోనే పండిట్ నెహ్రూ హుస్సేనీవాలా గ్రామాన్ని పాకిస్తాన్ నుంచి తీసుకొని... ప్రతిగా ఫాజిల్కా సమీపంలోని సరిహద్దును ఆనుకుని ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్‌కు ఇచ్చారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

1973లో అప్పటి పంజాబ్ సీఎం జ్ఞాని జైల్ సింగ్ చొరవతో హుస్సేనీవాలాలో ముగ్గురు అమరవీరుల స్మారకార్థం భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ప్రతి ఏటా మార్చి 23న ఇక్కడ షాహిదీ మేళా జరుగుతుంది. భగత్ సింగ్ తల్లి విద్యావతి దేవి 1975లో మరణించినప్పుడు... ఆమె అంత్యక్రియలు కూడా హుస్సేనీవాలాలోనే జరిగాయి. 1965లో విప్లవకారుడు బటుకేశ్వర్ దత్ అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగాయి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రేమికుల రోజు సందర్భంగా దాదాపు 1.1 కోట్ల క్రాస్ కలెక్షన్స్! సాలీడ్ కలెక్షన్స్ గురు..

 

చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

 

ప్రేమికుల రోజు సందర్భంగా దాదాపు 1.1 కోట్ల క్రాస్ కలెక్షన్స్! సాలీడ్ కలెక్షన్స్ గురు..

 

సజ్జల కుటుంబానికి రెండు ఓట్లు! ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #pakistan #India #4Villages #PakistanNews #IndiaNews