'రాజధాని ఫైల్స్' మూవీలో ఒక్కొక్క సీన్ అదిరిపోయింది అని, కళ్లకు కట్టినట్టు చూపించారు!

Header Banner

'రాజధాని ఫైల్స్' మూవీలో ఒక్కొక్క సీన్ అదిరిపోయింది అని, కళ్లకు కట్టినట్టు చూపించారు!

  Fri Feb 16, 2024 14:31        Cinemas, Politics

ఈమధ్య కాలంలో ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన సినిమా అంటే 'రాజధాని ఫైల్స్' అని చెప్పవచ్చు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకి భాను దర్శకత్వం వహించారు. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

ఇంకా చదవండి: కాంగ్రెస్ అకౌంటు సీజ్ చేసిన కేంద్రం! దుర్మార్గం, పోరాటం చేస్తాం - ఖర్గే

 

ఫిబ్రవరి 15న ఈ చిత్రం విడుదలవుతుండగా... తెలుగునాట పలు చోట్ల ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు వేశారు. బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల షోలు పూర్తవ్వగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

 

 ఇంకా చదవండి: ప్రైవేట్ బ్యాంకులను మోసం చేసేందుకు జగన్ సర్కారు! ప్రాజెక్టులో భారీ కుట్రకు జగన్ ప్రభుత్వం!

 

'రాజధాని ఫైల్స్' చూసి బరువెక్కిన హృదయాలతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇటీవల కాలంలో వాస్తవ సంఘటనలతో ఇంతలా గుండెలను పిండేసే సినిమా రాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ.. హత్తుకునేలా, ఆలోచింపచేసేలా ఉన్నాయని చెబుతున్నారు.

 

 ఇంకా చదవండి: అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న...

 

ఒక వర్గానికి లబ్ది చేకూర్చేలాగానో, ఒక వర్గానికి వ్యతిరేకంగానో కాకుండా... రైతుల త్యాగం, వారి ఆవేదననే ప్రధాన అంశంగా తీసుకొని... వాస్తవాలను చూపించిన తీరు అద్భుతమని అంటున్నారు. మూవీ టీం చెప్పినట్టుగానే ఈ సినిమా ప్రతి ఒక్క రైతుబిడ్డ చూడాల్సిన చిత్రమని గర్వంగా చెప్తున్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ప్రతి విభాగం పనితీరు మెప్పించిందని, ముఖ్యంగా దర్శకుడు భాను ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడని ప్రశంసిస్తున్నారు. ప్రీమియర్ షోలకు వస్తున్న స్పందన చూస్తుంటే.. 'రాజధాని ఫైల్స్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమనిపిస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

 

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

 

కేశినేని చిన్ని సహకారంతో విజయవాడలో మెగా జాబ్‍మేళా! 4 వేలకు పైగా యువతకు ఉద్యోగాలు

 

అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు!!

 

అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RajadhaniFiles #POlitics #ANdhrapradesh #APPolitics #APnews #NewMovieRealse #Jagan #RajadhaniFilesMovieStop #TopTeluguMovieRajadhaniFiles