బ్రిటన్‌పై భారతీయ విద్యార్థుల్లో విముఖత.. యూసీఏఎస్ తాజా గణాంకాల్లో వెల్లడి! తగ్గిన వీసా దరఖాస్తులు!

Header Banner

బ్రిటన్‌పై భారతీయ విద్యార్థుల్లో విముఖత.. యూసీఏఎస్ తాజా గణాంకాల్లో వెల్లడి! తగ్గిన వీసా దరఖాస్తులు!

  Fri Feb 16, 2024 16:11        World

UK: అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై బ్రిటన్ ఆంక్షల నేపథ్యంలో అక్కడి చదువులపై భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోంది. యూకేలోని యూనివర్సిటీస్ అండ్ కాలేజస్ అడ్మిషన్స్ సర్వీసెస్ విభాగం (UCAS) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెలుగు చూసింది.

 

ఇంకా చదవండి:  స్వీడన్: ఓషియానా వాటర్ పార్క్ లో అగ్ని ప్రమాదం! ఇన్స్పెక్షన్ లో తేలిన నిజాలు!

 

గతేడాదితో పోలిస్తే ఈమారు బ్రిటన్‌లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భారతీయ స్టూడెంట్ల దరఖాస్తుల సంఖ్య 4 శాతం తగ్గి 8,770కు పరిమితమైంది. నైజీరియా విద్యార్థుల దరఖాస్తులు ఏకంగా 46 శాతం మేర తగ్గి 1,590కు చేరుకున్నాయి. బ్రిటన్‌లో ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగినా భారతీయుల దరఖాస్తులు మాత్రం తగ్గడం గమనార్హం. 


ఇంకా చదవండి:  రాజధాని ఫైల్స్'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!!


ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఈ మారు 0.7 శాతం పెరిగింది. చైనా విద్యార్థుల దరఖాస్తులు అత్యధికంగా గతేడాది కంటే 3 శాతం పెరిగి 910కు చేరాయి. తుర్కియే, కెనడా విద్యార్థుల దరఖాస్తులూ పెరిగాయి. 


ఇంకా చదవండి:  కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...


అయితే, గ్రాడ్యుయేట్ వీసాల జారీని సమీక్షిస్తామని రిషి సునాక్ ప్రభుత్వం ప్రకటించడమే భారతీయ విద్యార్థుల విముఖతకు కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ వీసా పథకంలో విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మరో రెండేళ్ల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.



ఇక బ్రిటన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులకు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునే అవకాశం లేకపోవడం మరో కారణమని తెలుస్తోంది. గత నెలలోనే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

 

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

 

కేశినేని చిన్ని సహకారంతో విజయవాడలో మెగా జాబ్‍మేళా! 4 వేలకు పైగా యువతకు ఉద్యోగాలు

 

అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు!!

 

అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #UK #Indians #ForeignEducation #UKStudent #IndianStudentInUK #VIsa