జగన్ చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.. అడ్డుకోండి! గవర్నర్ కు చంద్రబాబు లేఖ!

Header Banner

జగన్ చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.. అడ్డుకోండి! గవర్నర్ కు చంద్రబాబు లేఖ!

  Tue May 14, 2024 20:47        Politics

జగన్ ప్రభుత్వం చివరి నిముషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని... దీనిని తక్షణమే నిలుపుదల చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నేడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోందని తెలిపారు.   కొద్దిరోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: తర్వాత రోజు కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం! తిరుపతి మహిళా వర్సిటీ వద్ద ఉద్రిక్తత!

 

ఎన్నికల కోడ్ కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమకాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని చంద్రబాబు గుర్తు చేశారు. "అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించింది. రుణాల కింద తెచ్చిన రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7000 కోట్లు ప్రభుత్వం సమీకరించింది.

 

ఇంకా చదవండి: ఇది రాజకీయ ఆర్థిక కుట్ర... ఈసీ వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలి! ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు..వర్ల రామయ్య

 

ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా తమకు అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు, సీఎం జగన్ తన బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలి" అంటూ చంద్రబాబు తన లేఖలో గవర్నర్ ను కోరారు. చంద్రబాబు.... గవర్నర్ కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా ట్యాగ్ చేశారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి! కూటమి 100 నుంచి 145 స్థానాల్లో గెలవాలని!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Governor #Jagan #TDP #YSRCP