కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి!

Header Banner

కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి!

  Sat Jun 15, 2024 11:13        Kuwait

జూన్ 12న తెల్లవారు జామున కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లాకు చెందిన కొట్టె గంగయ్యతో మంద భీంరెడ్డి 14న రాత్రి వాట్సాప్ కాల్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా నెరేళ్ల, మెదక్ జిల్లా దుబ్బాక కు చెందిన ఇద్దరు మొదటి అంతస్తు నుంచి లుంగీల సాయంతో కిందకు దిగారు. ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించి పంపించారు.

 

మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య (49) కువైట్ లోని 'హైవే సూపర్ మార్కెట్' లో గత పన్నెండు ఏళ్లుగా హెల్పర్ గా పనిచేస్తున్నాడు.  సూపర్ మార్కెట్ యాజమాన్యం తన సిబ్బంది కోసం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో వసతి సౌకర్యం (లేబర్ అకామడేషన్) ఏర్పాటు చేసింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రెండవ అంతస్తులో ఒక రూములో గంగయ్యతో పాటు మరో తెలుగు వ్యక్తి, ఇద్దరు కేరళ వాళ్ళు ఉంటారు. ఆ రోజు ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన ఒక కేరళ అతను ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి వచ్చి 4.15 ని.లకు చేసిన అరుపులు విన్న మిగతా ముగ్గురు ఘాడ నిద్ర నుంచి లేచారు. గది బయటకు వచ్చి చూడగా దట్టమైన పొగ, చిమ్మ చీకటి. గంగయ్య రూమ్మేట్స్ ముగ్గురు రెండవ అంతస్తు నుంచి కిందికి దూకారు. వాళ్ళ కాళ్ళు విరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

రెండవ అంతస్తు నుంచి కిందికి దూకడానికి ధైర్యం చాలని గంగయ్య తన మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ వెలుగులో పరిసరాలను గమనించాడు. దట్టమైన పొగ వలన కళ్ళు మండినా, చిమ్మ చీకటిలో గోడను పట్టుకుని మెల్ల మెల్లగా కిటికీ వద్దకు వెళ్లి కేబుల్ వైరు సహాయంతో కింది అంతస్తు లోని రేకులపై దూకాడు. పక్క బిల్డింగ్ వాళ్ళు వేసిన నిచ్చెన సాయంతో కిందికి దిగాడు. ఆసుపత్రిలో చేరిన గంగయ్యకు స్కానింగ్, ఎక్స్-రే తదితర పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. శరీరానికి అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయి. టెన్షన్ లో గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం లాంటివి జరిగాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది అని తెలిసింది. 

 

ఇవి కూడా చదవండి 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి! 

 

కూటమి సహాయం వల్లనే మోడీ ప్రధాని అయ్యారు! ఉండవల్లి అరుణ్ కుమార్!

 

గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్! 

 

ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి! 

 

న్యూజిలాండ్: టిడిపి విజయోత్సవాలను కోలాహలంగా చేసుకున్న ఎన్నారై టిడిపి సభ్యులు! ఆనందంగా రక్తదాన శిబిరాలు! 

 

కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు! 

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం! 

 

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants