అక్కడ జైల్లో ఖైదీలకు భారీ జీతాలు! అధికారులు, నిపుణులను మించిన ఆదాయం!

Header Banner

అక్కడ జైల్లో ఖైదీలకు భారీ జీతాలు! అధికారులు, నిపుణులను మించిన ఆదాయం!

  Sun Nov 24, 2024 19:54        Others

వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో  పరివర్తన తీసుకురావడానికి జైళ్లలో వారితో పనులు చేయించడంతోపాటు పలు రకాల శిక్షణలు ఇస్తుంటారు. వాటి ద్వారా ఖైదీలకు ఆదాయం సమకూరేలా జైళ్ల శాఖలు కృషి చేస్తుంటాయి. అయితే.. యూకే లోని జైళ్లలో ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కంటే ఎక్కువ జీతం అందుకుంటున్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదిక పేర్కొంది. యూకేలోని పలు బహిరంగ జైళ్లలోని ఖైదీలు బయటకు వెళ్లి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అలా వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుంటున్న ఖైదీలు.. జైల్లో ఉండే సెక్యూరిటీ గార్డులు, సెకండరీ టీచర్లు, బయోకెమిస్ట్లు, సైకోథెరపిస్ట్ల కంటే అధికంగా సంపాదిస్తున్నారు. వీరిలో కొందరు అత్యధికంగా ఏడాదికి $46,005 (రూ.38,84,491) నికర వేతనం పొందుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. మరికొందరు ఖైదీలు $28,694 (రూ. 24,22,814) కంటే ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారు. కాగా, జైలు గార్డు సగటు జీతం $35,085 (రూ. 29,62,446) మరి కొందరు లారీలు, బస్సులు సైతం నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. వీరు తమ శిక్షా కాలం ముగిసే సమయానికి తాత్కాలిక లైసెన్స్ సైతం పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంపాదించిన దాని నుంచే ఖైదీలు పన్నులు, కోర్టు జరిమానాలు చెల్లిస్తారని అధికారులు పేర్కొన్నారు. వీరు తమ సంపాదనలో కొంత భాగం పలు స్వచ్చంద సంస్థలకూ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షాకాలం ముగిసిన అనంతరం వారు పరివర్తన చెందిన వ్యక్తులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతోందని అధికారులు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #khaidi #jail #security #uk #highsalaries #todaynews #flashnews #latestupdate